యూఎస్ క్యాపిటల్ భవనం వద్ద గత దాదాపు ఐదు నెలలుగా పహారా కాస్తున్న నేషనల్ గార్డ్స్ దళాలు సోమవారం ఆ ప్రాంతం నుంచి నిష్క్రమిస్తున్నట్లు సమాచారం. క్యాపిటల్ భవనం వద్ద విధులు నిర్వహిస్తున్న 2,149 మంది నేషనల్ గార్డ్స్‌ను ఆ ప్రాంతంలో కొనసాగించాలని తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని అమెరికా రక్షణ విభాగమైన పెంటగాన్ గత వారం వెల్లడించింది.
నేషనల్ గార్డ్స్ వీడిన అనంతరం ఆ ప్రాంతం స్థానిక పోలీసుల అధీనంలోకి వస్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే భద్రత దృష్ట్యా భవనాన్ని మరికొంత కాలం సందర్శకులకు అనుమతించమని స్పష్టం చేశాయి.