తెలంగాణ

telangana

ETV Bharat / international

సౌర కుటుంబ హద్దులు దాటేసిన వాయేజర్​-2 - nasa breaking news today

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ప్రయోగించిన వాయేజర్​-2 అరుదైన ఘనత సాధించింది. సౌర కుటుంబం పరిధిని దాటి తారాంతర మాధ్యమం (ఇంటర్​స్టెల్లార్​ స్పేస్​ మీడియం)ను చేరుకుంది. 2012లో వాయేజర్​-1 తర్వాత ఈ ఘనత సాధించిన రెండో వ్యోమనౌకగా చరిత్ర సృష్టించింది.

సౌర కుటుంబ హద్దులు దాటేసిన వాయేజర్​-2

By

Published : Nov 6, 2019, 5:16 AM IST

Updated : Nov 6, 2019, 7:35 AM IST

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా)కు చెందిన వాయేజర్​-2 వ్యోమనౌక సౌర కుటుంబ పరిధిని దాటి వెళ్లిపోయింది. సూర్యుడి ప్రభావం లేని, తారాంతర మాధ్యమాన్ని (ఇంటర్​స్టెల్లార్​ స్పేస్​ మీడియం-ఐఎస్​ఎంకు)చేరుకుంది. భూమి నుంచి పయనమైన 4 దశాబ్దాల తర్వాత వ్యోమనౌక ఈ లక్ష్యాన్ని సాధించింది. ఈ ఘనత సాధించిన రెండో వ్యోమనౌకగా చరిత్ర సృష్టించింది. 2012లో వాయేజర్​-1 ఆ ప్రత్యేకతను అందుకుంది. 1977లో వాయేజర్​1, 2 వ్యోమనౌకలను ప్రయోగించింది నాసా.

సూర్యుడి నుంచి వెలువడే గాలులు.. సౌర కుటుంబం చుట్టూ బుడగ ఆకృతిలో ఒక సరిహద్దును ఏర్పరుస్తున్నాయి. గత ఏడాది నవంబర్​ 5న వాయేజర్​-2 ఈ ప్రదేశానికి చేరుకుందని నాసా శాస్త్రవేత్తలు తాజాగా నిర్ధరించారు. ఆ వ్యోమనౌకలోని ప్లాస్మా తరంగ పరికరంలోని ప్లాస్మా సాంద్రత ఆకస్మికంగా పెరిగిపోవడాన్ని గమనించారు. వేడి, తక్కువ సాంద్రత కలిగిన సౌర ప్లాస్మా నుంచి చల్లటి, అధిక సాంద్రత కలిగిన ఐఎస్​ఎం ప్లాస్మాలోకి అది అడుగుపెట్టినట్లు వెల్లడైంది. ప్లాస్మాలు సహా ద్రవాలన్నీ నిర్దిష్ట సరిహద్దును ఏర్పరుస్తాయని ఇది స్పష్టం చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

ప్రస్తుతం సూర్యుడికి, వాయేజర్​కు మధ్య దూరం 11 బిలియన్​ మైళ్లుగా ఉంది. ఈ వ్యోమనౌక నుంచి భూమికి సమాచారం అందడానికి సుమారు 19 గంటల సమయం పడుతోంది.

ఇదీ చూడండి: అంతరిక్షంలోకి మందు బాటిళ్లు... ఎందుకో తెలుసా?​

Last Updated : Nov 6, 2019, 7:35 AM IST

ABOUT THE AUTHOR

...view details