అరుణ గ్రహంపై జీవజాలం కోసం పరిశోధన చేసేందుకు.. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన పర్సీవరెన్స్ రోవర్.. మరికొన్ని గంటల్లో రోదసిలోకి దూసుకెళ్లనుంది. జీవజాతి ఆనవాళ్లు సహా అంగారక గ్రహానికి సంబంధించిన.. భౌగోళిక, రసాయనిక స్వరూపాన్ని అధ్యయనం చేసేందుకు పర్సీవరెన్స్‌ను.. ప్రయోగిస్తున్నారు. భవిష్యత్తులో అంగారకునిపైకి మానవసహిత యాత్రకు కూడా ఈ ప్రయోగం బాటలు వేయనుంది. 7 నెలల పాటు అంతరిక్షంలో ప్రయాణం చేసి 2021 ఫిబ్రవరి 18న రోవర్ అంగారకుడిపైకి చేరనుంది. అక్కడకి చేరుకున్న తర్వాత ఒక మార్స్ ఇయర్.. అంటే 687 రోజుల పాటు పరిశోధన చేయనుంది.
జెజెరో ప్రాంతంలో..
అంగారక గ్రహంపై ఒకప్పుడు జీవం ఉండేందుకు.. అత్యధిక అవకాశం ఉన్న ప్రాంతాన్ని రోవర్ దిగేందుకు ఎంపిక చేశారు. ఈ రోవర్ అంగారకుడిపై జెజెరో అనే ప్రాంతంలో దిగబోతోంది. ఈ ప్రాంతంలో కొన్ని వందల కోట్ల సంవత్సరాల క్రితం.. దాదాపు కొల్లేరు సరస్సుకి ఎనిమిది రెట్ల వైశాల్యం ఉన్న సరస్సు ఉండేదని, ఈ సరస్సు కొన్ని నదులకి నీరు అందించేదని, గత పరిశోధనల ఆధారంగా శాస్త్రవేత్తలు అంచనాకు వేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో డెల్టా తరహాలో డెపాజిట్లు ఉండడం వలన ఇక్కడ జీవ అవశేషాలు దొరకవచ్చని భావిస్తున్నారు. ఆ ప్రాంతంలో పర్సీవరెన్స్ రోవర్ నమూనాలు సేకరించి భద్రంగా ఉంచుతుంది.వాటిని భూమికి తీసుకువచ్చి ఇక్కడి ల్యాబ్స్‌లో పరిశోధన చేయాలని యోచిస్తున్నారు.
నాలుగు లక్ష్యాలు..