ముక్కు ద్వారా ఇచ్చే టీకాలతో కరోనాను సమర్థవంతంగా అడ్డుకోవచ్చని.. అమెరికన్ శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో తేలింది. నాసల్ టీకా వల్ల కరోనా నుంచి మెరుగైన రక్షణ లభించటంతో పాటు.. వైరస్ సంక్రమణను అడ్డుకుంటున్నట్లు సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్ పేర్కొంది. ప్రస్తుతమున్న కరోనా టీకాలు.. వైరస్‌ను బాగానే అడ్డుకుంటున్నా మరింత సమర్థవంతంగా పనిచేసే టీకాల అవసరముందని.. జార్జియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ పాల్ మెక్రే అన్నారు.
నాసల్ టీకాలు మంచి సత్ఫలితాలు ఇస్తున్నందున.. అవి వైరస్ వ్యాప్తిని అడ్డుకొని కరోనా విజృంభణను నిలువరిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. పైగా నాసల్ టీకా సింగిల్ డోసు మాత్రమే తీసుకోవాల్సి ఉండటం సహా సాధారణ రిఫ్రిజిరేటర్ ఉష్ణోగ్రతల్లో మూడు నెలల పాటు భద్రపరుచుకునే వెసులుబాటు మరింత ప్రయోజనకరంగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.