తెలంగాణ

telangana

ETV Bharat / international

చంద్రయాన్​-2 ల్యాండర్​​ 'విక్రమ్' ఫొటోలు తీసిన నాసా!

చంద్రయాన్-2 ల్యాండర్ విక్రమ్​ చిత్రాలను తమ లూనార్​ రికానసెన్స్​ ఆర్బిటర్ వ్యోమనౌక తీసినట్లు నాసా ప్రకటించింది. ఈ కొత్త చిత్రాలను పాత వాటితో పోల్చి చూసిన తరువాతే ల్యాండర్​ కనిపించిందీ లేనిదీ తెలుస్తుందని ఓ నాసా శాస్త్రవేత్త తెలిపారు. ఆర్బిటర్​ మాత్రం సురక్షితంగా ఉందని స్పష్టం చేశారు.

By

Published : Sep 20, 2019, 5:20 AM IST

Updated : Oct 1, 2019, 7:02 AM IST

చంద్రయాన్​-2 ల్యాండర్​​ 'విక్రమ్' ఫోటోలు తీసిన నాసా!

చంద్రయాన్​-2 ల్యాండర్​​ 'విక్రమ్' ఫొటోలు తీసిన నాసా!

చంద్రుని దక్షిణ ధ్రువంపై సాఫ్ట్​ ల్యాండింగ్​ అయ్యే క్రమంలో తడబడిన ల్యాండర్​ 'విక్రమ్​' ఫోటోలను తమ లూనార్​ రికానసెన్స్ ఆర్బిటర్​ వ్యోమనౌక తీసినట్లు నాసా ప్రకటించింది. రెండు రోజుల క్రితం తమ ఆర్బిటర్​ పంపిన ల్యాండర్​ విక్రమ్ చిత్రాలను పరిశీలిస్తున్నట్లు తెలిపింది.

కొత్త చిత్రాలను పాత వాటితో పోల్చి చూసిన తరువాతే ల్యాండర్ కనిపించినదీ లేనిదీ తెలుస్తుందని ఓ నాసా శాస్త్రవేత్త చెబుతున్నారు. ఫోటోలు తీసేటప్పుడు ల్యాండర్ వ్యోమనౌక నీడలోనో లేదా నిర్దేశిత ప్రాంతానికి బయట ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు. లూనార్ ఆర్బిటర్ చంద్రునికి అత్యంత సమీపం నుంచి ఫోటోలు తీయడం వల్ల ఎక్కువ ప్రదేశం నీడలో ఉన్నట్లు నాసా శాస్త్రవేత్త వివరించారు.

ఆర్బిటర్ క్షేమమే..

చంద్రయాన్​-2 ఆర్బిటర్​ చంద్రుని కక్ష్యలో సాధారణంగానే పనిచేస్తున్నట్లు ఇస్రో ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. పేలోడర్స్ కూడా బాగానే పనిచేస్తున్నట్లు తెలిపింది. ల్యాండర్​ విక్రమ్​తో సంబంధాలు కలవకపోవడానికి గల కారణాలను జాతీయస్థాయి కమిటీతో పాటు ఇస్రో నిపుణులు విశ్లేషణ చేస్తున్నట్లు స్పష్టం చేసింది.

తడబాటు..

చంద్రునిపై ల్యాండ్​ అవుతున్న చివరి నిమిషంలో​ విక్రమ్​ నుంచి సంకేతాలు నిలిచిపోయాయి. దీనిని పునరుద్ధరించేందుకు ఈ నెల 21తో గడువు ముగియనుంది. ల్యాండర్, రోవర్​ మిషన్ల జీవితకాలం చంద్రునిపై ఒక రోజుకాగా... భూమిపై 14 రోజులతో సమానం. రెండు రోజుల్లో ల్యాండర్​తో సంకేతాలు పునరుద్ధరించకపోతే.. ఇస్రో పూర్తిగా ఆశలు వదులుకోవాల్సి ఉంటుంది.

ఇదీ చూడండి: 400 జిల్లాల్లో రుణదాతలతో బ్యాంకుల భేటీ

Last Updated : Oct 1, 2019, 7:02 AM IST

ABOUT THE AUTHOR

...view details