అంతరిక్షంలో ఎక్కువ కాలం గడపటం వల్ల వ్యోమగాములకు ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను గుర్తించి, పరిష్కరించేందుకు సరికొత్త పరిశోధనను చేపట్టింది అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా). స్క్విడ్ అనే రకానికి చెందిన చిన్న చేపలను కొన్నింటిని పరిశోధన కోసం స్పేస్‌కు పంపించింది.
అంతరిక్షంలో ఎక్కువ కాలం గడపటం వల్ల ఈ చేపలకు ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను గుర్తించి.. వ్యోమగాములకు స్పేస్‌లో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను పరిష్కరించవచ్చని యూనివర్సిటీ ఆఫ్ హవాయ్‌కు చెందిన పరిశోధకురాలు జెమీ ఫోస్టర్ తెలిపారు.
" వ్యోమగాములు అంతరిక్షంలో ఎక్కువ కాలం ఉంటారు. దీంతో వారి రోగనిరోధక శక్తి క్షీణించి అనారోగ్యానికి గురవుతుంటారు. స్క్విడ్ చేపలకు స్పేస్‌లో ఎదురయ్యే సమస్యల ఆధారంగా వ్యోమగాములకు అంతరిక్షంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించవచ్చు."