అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తన ఆర్టెమిస్ మిషన్ కోసం రెండు నెక్స్ట్ జెనరేషన్ స్పేస్సూట్లను రూపొందించింది. ఇవాళ వాటిని వాషింగ్టన్‌లోని తన ప్రధాన కార్యాలయంలో ప్రదర్శించనుంది.
నాసా 2024 నాటికి తమ వ్యోమగాములను చంద్రునిపైకి పంపడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం రెండు స్పేస్సూట్లను రూపొందించింది. ఒకటి ఓరియన్ అంతరిక్ష నౌకలో ప్రయాణించడానికి, మరొకటి చంద్రుని దక్షిణ ధ్రువ ఉపరితలాన్ని అన్వేషించడానికి ఉపయోగపడుతుంది.
చంద్రుడు, అంగారక గ్రహం సహా ఇతర గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఈ నూతన తరం స్పేస్సూట్లు ఉపకరిస్తాయని నాసా భావిస్తోంది.
ప్రత్యక్షప్రసారం
అమెరికాలో ఈ స్పేస్సూట్ల ప్రదర్శన కార్యక్రమం జరుగుతుంది. ఈడీటీ అండ్ ఫీచర్ నాసా పరిపాలనాధికారి జిమ్ బ్రిడెన్స్టైన్.. స్పేస్‌సూట్ ఇంజినీర్లతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం నాసా టెలివిజన్, నాసా వెబ్సైట్లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.