తెలంగాణ

telangana

ETV Bharat / international

అంగారకుడిపైకి మీ పేరు వెళ్లాలంటే..?

అంగారక గ్రహంపై మీ పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలనుకుంటున్నారా? చంద్రుడిపై తప్ప మరో గ్రహంపై మానవుడు అడుగే పెట్టలేదు... పేరు నిలిచిపోవడమేంటీ అని సందిగ్ధంగా ఉందా...ఈ అవకాశాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన విభాగం నాసా మీకు కల్పిస్తోంది.

అంగారకుడిపైకి మీ పేరు వెళ్లాలంటే..?

By

Published : May 23, 2019, 7:01 AM IST

అంగారకుడిపై అడుగు పెట్టే ముందే మనుషుల పేర్లు అక్కడ నిలిచిపోయే చర్యను తీసుకుంది అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా. 2020 లో అంగారకుడి పైకి వెళ్లే ఇన్​సైట్ రోవర్​ ద్వారా పేర్లను అక్కడికి పంపించనుంది.

చిప్​లపై రాసిన పేర్లను రోవర్ అంగారకుడిపైకి మోసుకెళుతుంది.

రోవర్ అసలు లక్ష్యమేంటంటే...

రోవర్ టన్ను బరువైన ఓ రోబో సైంటిస్ట్​ను అంగారకుడిపైకి తీసుకెళుతుంది. ఈ యంత్ర పరిశోధకుడు అక్కడి వాతావరణ పరిస్థితులు, సూక్ష్మ జీవుల జీవనంపై అధ్యయనానికి కావలసిన నమూనాలను భూమిపైకి పంపిస్తాడు.

పేర్లెందుకు?

ఇన్​సైట్ రోవర్ ప్రయోగం ద్వారా చేపట్టబోయే పరిశోధనాంశాలు వినూత్నమైనవి. అలాంటి మిషన్​కు విస్తృత ప్రచారం కల్పించడం కోసం పేర్లను పంపించేందుకు నిర్ణయించింది నాసా.

"ఈ చారిత్రక అంగారక ప్రయోగానికి సంబంధించిన సమాచారాన్ని ప్రతి ఒక్కరితో పంచుకునేందుకు ఈ విధమైన కార్యాచరణకు సంకల్పించాం"

- థామస్ జూర్బుచెన్, నాసా అధికారి

ఈ రోవర్​ ద్వారా 20 లక్షలకు పైగా పేర్లను అంగారకుడి పైకి పంపే అవకాశం ఉంది. అయితే ఈ పేర్లను రాయడానికి ఎన్ని చిప్​లను ఉపయోగించే అవకాశం ఉందో తెలుసా..రెండంటే రెండే ఎందుకంటే ఒక్క చిప్​పై 10 లక్షల పేర్లు రాయొచ్చు మరి.

ఇదీ చూడండి: మోదీని మించిపోయిన రాహుల్ గాంధీ

ABOUT THE AUTHOR

...view details