అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా).. మరో కీలక ప్రయోగాన్ని నిర్వహించింది. ఆర్టెమిస్ స్సేస్ ప్రోగ్రామ్‌లో భాగంగా చివరిదైన.. భారీ స్పేస్ లాంచ్ సిస్టమ్(ఎస్ఎల్ఎస్) రాకెట్‌కు గ్రీన్ రన్ హాట్ ఫైర్ పరీక్షను చేపట్టింది. 2020 డిసెంబర్ 20న జరిపిన ఏడో దశ పరీక్ష విజయవంతం కాగా.. నేడు చివరిదైన ఎనిమిదో దశ పరీక్షను నిర్వహించింది.
నాసా 'ఆర్టెమిస్' తుది పరీక్ష విజయవంతం - అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ తాజా ప్రయెగాలు
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా).. ఆర్టెమిస్ ప్రోగ్రామ్‌లో భాగంగా మరో కీలక పరీక్షను నిర్వహించింది. గ్రీన్ రన్ హాట్ ఫైర్ ఎనిమిదో దశ పరీక్షను విజయవంతంగా చేపట్టింది.
విజయవంతంగా నాసా 'ఆర్టెమిస్' తుది పరీక్ష
మిసిసీపీలోని బే సెయింట్ లూయిస్ సమీపంలోని నాసా స్టెనిస్ అంతరిక్ష కేంద్రంలో ఈ ప్రయోగం చేశామని నాసా తెలిపింది. ఆర్టెమిస్ స్సేస్ ప్రోగ్రామ్‌లో భాగంగా 2024లో చంద్రునిపైకి మొదటిసారిగా మహిళను, పురుషుడిని తీసుకుపోవాలని నాసా లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. నాసా చేపట్టే ఈ ప్రయోగంతో వాణిజ్యేతర మానవ అంతరిక్ష ప్రయాణానికి మార్గం సుగమం కానుంది.
ఇదీ చూడండి:చంద్రునిపై కాలుమోపనున్న భారతీయ అమెరికన్!