అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు రాబర్ట్ మ్యూలర్ నివేదిక క్లీన్చిట్ ఇచ్చింది. 2016 అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై సరైన ఆధారాలు లేవని తేల్చి చెప్పింది. మ్యూలర్ ప్రకటనకు సంతోషించిన ట్రంప్... విభిన్న రీతిలో వ్యాఖ్యానించారు. ఇలాంటి పరిస్థితి మరే అధ్యక్షుడికి రాకూడదంటూ ఆశాభావం వ్యక్తం చేశారు.
"ఇది నాకు చాలా మంచి రోజు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎలాంటి కుట్ర లేదని నివేదిక స్పష్టం చేసింది. అలా ఎన్నడూ, ఎప్పటికీ జరగదు. అయితే నా పరిస్థితి మరే అధ్యక్షుడికీ రాకూడదు."- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
2016 అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం ఉందంటూ ఆరోపణలు వచ్చాయి. దీనిపై ప్రత్యేక దర్యాప్తు అధికారి రాబర్ట్ మ్యూలర్ నేతృత్వంలో విచారణ కమిటీని ఏర్పాటు చేసింది అమెరికా. రష్యా సహకారంపై ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని పేర్కొంటూ 400 పేజీల నివేదిక స్పష్టం చేసింది. మ్యూలర్ నివేదికను విడుదల చేశారు అమెరికా అటార్నీ జనరల్ విలియమ్ బార్.