మెక్సికోలో వరుణుడి ప్రకోపానికి ఆరుగురు బలి - కొండ చరియలు
మెక్సికోలోని ప్యూబ్లా నగరంలో వర్షం బీభత్సం సృష్టించింది. బురద నీరు రోడ్లపై ఏరులై పారింది. కొండ చరియలు ఇళ్లపై విరిగిపడి ఆరుగురు మృత్యువాత పడ్డారు.
మెక్సికోలో వరుణుడి ప్రకోపానికి ఆరుగురు బలి
మెక్సికోలో భారీ వర్షాలకు కొండ చరియలు విరిగి ఇళ్లపై పడ్డాయి. ప్యూబ్లా నగర శివార్లలోని సాంటో టోమస్ చౌట్ల గ్రామంలో జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. వీరిలో ఇద్దరు చిన్నారులు.
శిథిలాల చిక్కుకున్న వారిని కాపాడేందుకు భద్రతా సిబ్బంది రంగంలోకి దిగారు. ఇంటింటికీ వెళ్లి పరిస్థితులు పరిశీలించారు.