అమెరికాలోని న్యూయార్క్లో సినిమా థియేటర్లు త్వరలోనే పునఃప్రారంభం కానున్నాయి. కరోనా నేపథ్యంలో మూతపడిన థియేటర్లు వచ్చే శుక్రవారం తెరచుకోనున్నాయి. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు అక్కడి గవర్నర్ ఆండ్రూ క్యూమో.
కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని.. ప్రతి స్క్రీన్కూ సీట్ల సామర్థ్యంలో 25శాతం(గరిష్ఠంగా 50 మంది) ప్రేక్షకులను మాత్రమే అనుమతించాలని క్యూమో స్పష్టంచేశారు. థియేటర్ ఆవరణలో అందరూ మాస్కులు ధరించి, భౌతిక దూరం వంటి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని నిర్దేశించారు.