తెలంగాణ

telangana

ETV Bharat / international

ముగ్గురు చిన్నారుల హత్య- తల్లి అరెస్టు - అమెరికాలో ఐదేళ్ల లోపు వయస్సున్న చిన్నారుల హత్య

అమెరికాలో ఐదేళ్లలోపు వయసున్న ముగ్గురు చిన్నారులు దారుణ హత్యకు గురయ్యారు. చిన్నారుల నాన్నమ్మ వచ్చి చూడగా.. వారి తల్లి ఇంట్లో కనిపించలేదు. దాంతో.. ఈ కేసులో మృతుల తల్లిని పోలీసులు అరెస్టు చేశారు.

Mother arrested after 3 children found slain in Los Angeles
ముగ్గురు చిన్నారుల హత్య- తల్లి అరెస్టు

By

Published : Apr 11, 2021, 6:39 AM IST

అమెరికాలోని లాస్​ ఏంజెలిస్​లో దారుణం జరిగింది. ఐదేళ్లలోపు వయస్సు ఉన్న ముగ్గురు చిన్నారులు హత్యకు గురయ్యారు. శనివారం ఉదయం ఈ ఘటన జరిగినట్లు అక్కడి పోలీసులు తెలిపారు. ఈ కేసులో చిన్నారుల తల్లి లిలియానా కారిల్లోను టులారే కౌంటీలో అరెస్టు చేశారు.

చిన్నారుల నాన్నమ్మ తమ ఇంటికి తిరిగి రాగా.. ముగ్గురు చిన్నారులు విగత జీవులుగా కనిపించారు. ఇంట్లో తల్లి కనిపించలేదు. దాంతో పోలీసులకు నాన్నమ్మ ఫిర్యాదు చేశారు. చిన్నారుల శరీరాలపై కత్తిపోట్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. అయితే.. ఎలా చనిపోయారన్న దానిపై అధికారిక సమాచారాన్ని వెల్లడించలేదు.

బేకర్స్​ఫీల్డ్​ ప్రాంతంలో కారు నడుపుతూ వెళ్లి మరో కారును లిలియానా కారిల్లో ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. అనంతరం అక్కడి వారితో వాగ్వాదానికి దిగారని చెప్పారు. దాంతో పోలీసులు ఆమెను నిందితురాలిగా భావించి టులారే కౌంటీ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చూడండి:కాబోయే కోడలు.. తన కూతురే అని తెలిస్తే?

ABOUT THE AUTHOR

...view details