భారత్ - చైనా సైనిక, ఆర్థిక వివాదాల్లో భారత్‌కే తమ మద్దతు ఉంటుందని ఎక్కువమంది అమెరికన్లు కోరుకుంటున్నట్లు ఓ సర్వేలో తేలింది. ఆస్ట్రేలియాకు చెందిన లోవీ ఇన్‌స్టిట్యూట్ చేపట్టిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. జులై 7న చేపట్టిన ఈ సర్వేలో 1,012 మంది అగ్రరాజ్య పౌరులు భాగస్వాములు అయ్యారు.
ఆసియాలో అతిపెద్ద రెండు దేశాల మధ్య సైనిక వివాదం తలెత్తితే 63.5 శాతం, ఆర్థిక వివాదమైతే 60.6 శాతం మంది ఎవ్వరికీ మద్దతు ఇవ్వకూడదని అన్నారు. అయితే చైనాతో పోలిస్తే ప్రత్యేకంగా భారత్‌కు మద్దతిస్తున్నవారి సంఖ్య భారీగా ఉందని సర్వే తెలిపింది.
భారత్‌కు అండగా..
'భారత్, చైనా మధ్య సైనిక వివాదం తలెత్తితే 32.6 శాతం మంది అమెరికా పౌరులు.. భారత్‌కే అండగా నిలవాలని కోరుకున్నారు. 3.8 శాతం మంది మాత్రమే చైనాకు మద్దతుగా నిలిచారు. ఆర్థిక వివాదమైతే 36.3 శాతం మంది దిల్లీకి, 3.1 శాతం మంది బీజింగ్‌కు అగ్రరాజ్యం మద్దతు ఇవ్వాలని ఓటేశారు' అని పేర్కొంది.