తెలంగాణ

telangana

ETV Bharat / international

ఒక్క వారంలో నిరుద్యోగ భృతికి 10లక్షల దరఖాస్తులు - Americans jobless benefits

కరోనా సంక్షోభంతో అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్నప్పటికీ.. అమెరికన్లలో నిరుద్యోగ భయం తీవ్రస్థాయిలో ఉంది. నిరుద్యోగ భృతి కోసం.. గత వారం 10లక్షల దరఖాస్తులు అందినట్టు అగ్రరాజ్య అధికారులు వెల్లడించారు. ఇప్పటికే 14.5మిలియన్​ మందికిపైగా ప్రజలు ప్రయోజనాలను అందుకుంటున్నట్టు పేర్కొన్నారు.

More than 1 million Americans applied for jobless benefits
ఒక్క వారంలో నిరుద్యోగ భృతికి 10లక్షల దరఖాస్తులు

By

Published : Aug 28, 2020, 9:29 AM IST

అమెరికన్లను నిరుద్యోగ భయం వెంటాడుతోంది. గత వారం.. 10లక్షలకుపైగా మంది అమెరికన్లు నిరుద్యోగ భృతికి దరఖాస్తు చేసుకున్నారు. కరోనా సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్నప్పటికీ.. ఇంత భారీ స్థాయిలో దరఖాస్తులు అందుతుండటం అక్కడి అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది.

కరోనా సంక్షోభానికి ముందు పరిస్థితులు కొంతమేర అదుపులో ఉండేవి. సహాయం కోసం దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య ఒక్కవారంలో 7లక్షలు దాటేది కాది. కానీ కరోనా వల్ల ఉద్యోగాలు కోల్పోయిన నేపథ్యంలో ఈ ఏడాది మార్చి నుంచి చాలా వారాల పాటు దరఖాస్తుల సంఖ్య 10లక్షలు దాటిందని అగ్రరాజ్య కార్మికశాఖ వెల్లడించింది.

ప్రస్తుతం 14.5మిలియన్​ మంది ఈ సంప్రదాయ నిరుద్యోగ భృతిని పొందుతున్నారు. గతేడాది ఈ సంఖ్య 1.7మిలియన్​గా ఉండేది. దీంతో అగ్రరాజ్యంలో అనేక కుటుంబాలు వీటిపైనే ఆధారపడుతున్నట్టు స్పష్టమవుతోంది.

ఇదీ చూడండి:-రానున్న అధ్యక్ష ఎన్నికల్లో అమెరికన్లు ఎవరి పక్షమో?

ABOUT THE AUTHOR

...view details