కొవిడ్ చికిత్సారంగాన్ని (Covid Treatment) కొత్త మలుపు తిప్పగల సరికొత్త ఔషధమొకటి (Molnupiravir Covid Drug) త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైరస్ జన్యు కోడ్‌లలో మార్పులు చేయడం ద్వారా మహమ్మారి తీవ్రతకు కళ్లెం వేయగల యాంటీవైరల్ మందుబిళ్ల (మాత్ర)ను (Covid Oral drug) తాము అభివృద్ధి చేసినట్లు అమెరికాకు చెందిన మెర్క్ అండ్ కో ఫార్మాసూటికల్ కంపెనీ తెలిపింది. 'మాల్నుపిరవిర్'గా (Molnupiravir tablet) దానికి నామకరణం చేసినట్లు వెల్లడించింది. (Molnupiravir Covid)
Molnupiravir Covid: మందుబిళ్లతో కొవిడ్ తీవ్రతకు కళ్లెం! - మోల్నుపిరవిర్ కోవిడ్
కరోనా వైరస్ తీవ్రతను తగ్గించే యాంటీవైరల్ మాత్రను (Molnupiravir Covid) అమెరికాకు చెందిన మెర్క్ అండ్ కో ఫార్మా సంస్థ అభివృద్ధి చేసింది. మాల్నుపిరవిర్గా దీనికి నామకరణం చేసింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న డెల్టా సహా అన్నిరకాల కరోనా వైరస్‌లపై ఈ ఔషధం (Molnupiravir Covid Drug) సమర్థంగా పనిచేస్తోందని సంస్థ వివరించింది.
కొవిడ్ బారిన పడ్డవారు ఆస్పత్రి పాలయ్యే అవకాశాలను, మృత్యువాతపడే ముప్పును ఈ మాత్ర సగం మేరకు తగ్గిస్తుందని సంస్థ పేర్కొంది. దాని అత్యవసర వినియోగానికి త్వరలోనే అనుమతులు (Molnupiravir Emergency Approval) కోరనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న డెల్టా సహా అన్నిరకాల కరోనా వైరస్‌లపై ఈ ఔషధం సమర్థంగా (Molnupiravir Covid trial) పనిచేస్తోందని వివరించింది. 'మాల్నుపిరవిర్' విపణిలో అందుబాటులోకి వస్తే.. కొవిడ్ వ్యాధికి నోటిద్వారా తీసుకునేందుకు వీలున్న (ఓరల్) తొలి యాంటీవైరల్ ఔషధం ఇదే అవుతుందని పేర్కొంది. (Molnupiravir Covid)
ఇదీ చదవండి:'పిల్లలకు త్వరలోనే కరోనా టీకా.. వారికే ప్రాధాన్యం'