తెలంగాణ

telangana

ETV Bharat / international

వారం వ్యవధిలో రెండుసార్లు భేటీ కానున్న మోదీ, ట్రంప్​ - నరేంద్ర మోదీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ వారం వ్యవధిలో రెండుసార్లు భేటీ కానున్నారు. ఈ నెల 22న హౌదీ-మోదీ కార్యక్రమంలో భాగంగా ఇరువురు సమావేశం కానున్నారు. అనంతరం... వచ్చే వారం న్యూయార్క్​ వేదికగా జరగనున్న ఐరాస సాధారణ అసెంబ్లీ సమావేశంలో భేటీ కానున్నారు.

వారం వ్యవధిలో రెండుసార్లు భేటీ కానున్న మోదీ, ట్రంప్​

By

Published : Sep 19, 2019, 12:02 PM IST

Updated : Oct 1, 2019, 4:29 AM IST

భారత్​-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి. దీనికి బలం చేకూర్చే విధంగా ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ వరుసగా సమావేశమవుతున్నారు.

ఇటీవల జపాన్​లో జీ-20, ఫ్రాన్స్​లో జీ-7 సదస్సుల సందర్భంగా రెండు సార్లు భేటీ అయిన ఇరువురు అగ్రనేతలు.. వచ్చే వారంలో మరో రెండు సార్లు సమావేశమవనున్నారు.

ఈ నెల 22న హ్యూస్టన్​లో జరగనున్న హౌదీ-మోదీ కార్యక్రమంలో భాగంగా తొలుత ట్రంప్​, మోదీ భేటీ అవుతారు. అనంతరం.. వచ్చే వారం న్యూయార్క్​ వేదికగా జరగనున్న ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ సమావేశంలో మరోమారు సమావేశం కానున్నట్లు అమెరికాలోని భారత రాయబారి హర్షవర్ధన్​ ష్రింగ్లా వెల్లడించారు. భారత్‌-అమెరికా వ్యూహాత్మక సంబంధాలు ఈ శతాబ్దంలోనే వినూత్న భాగస్వామ్యం దిశగా సాగనున్నాయన్నారు.

వచ్చే ఐదేళ్లలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపయి.. 280 బిలియన్​ డాలర్లకు చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు ష్రింగ్లా. వాణిజ్య సమస్యలు పరిష్కరించుకునేందుకు ఎప్పటికప్పుడు చర్చలు జరుగుతాయన్నారు.

ఇదీ చూడండి:భారత్​కు జై కొట్టిన ఐరోపా సమాఖ్య.. పాక్​కు చెంపపెట్టు

Last Updated : Oct 1, 2019, 4:29 AM IST

ABOUT THE AUTHOR

...view details