అమెరికన్ ఫార్మా సంస్థ మోడెర్నా రూపొందిస్తున్న వ్యాక్సిన్.. కొవిడ్-19 నుంచి ఎలుకకు రక్షణ కల్పించింది. ఈ మేరకు చేసిన అధ్యయనాన్ని నేచర్ జనరల్‌లో ప్రచురించారు.
కొవిడ్ నుంచి ఎలుకలను రక్షించిన మోడెర్నా టీకా - moderna's vaccine protects rats
మోడెర్నా రూపొందిస్తున్న వ్యాక్సిన్.. కొవిడ్-19 నుంచి ఎలుకలను కాపాడింది. మూడు వారాల వ్యవధిలో వ్యాక్సిన్‌ను తగిన మోతాదులో ఎలుకలకు ఇవ్వగా.. వాటి శరీరంలో వ్యాధి నిరోధకాలను టీకా ప్రేరేపించినట్లు పరిశోధనలో తేలింది. ఊపిరితిత్తులు, ముక్కులో వచ్చే ఇన్‌ఫెక్షన్ ప్రమాదం తొలగినట్లు వెల్లడైంది.
మూడు వారాల వ్యవధిలో ఒక మైక్రోగ్రామ్ మోతాదు గల ఎంఆర్‌ఎంఏ 1273 వ్యాక్సిన్‌ను ఎలుకకు ఇవ్వగా ఇది వైరస్‌ను చంపే వ్యాధి నిరోధకాలను ఎలుక శరీరంలో ప్రేరేపించినట్లు పరిశోధనలో తేలింది. రెండో ఇంజక్షన్ ఇచ్చిన 5 నుంచి 13వారాల తరువాత కరోనా సోకిన ఎలుకల్లో ఊపిరితిత్తులు, ముక్కులో వచ్చే ఇన్‌ఫెక్షన్ ప్రమాదం తొలగినట్లు వెల్లడైంది.
కరోనా వైరస్ ఉపరితలంపై ఉన్న స్పైక్ ప్రోటీన్ అణు నిర్మాణాన్ని గుర్తించేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఈ నిర్మాణాన్ని మోడెర్నా వ్యాక్సిన్‌లో ఉపయోగిస్తున్నారు.