తెలంగాణ

telangana

ETV Bharat / international

మోడెర్నా టీకాకు అమెరికా అత్యవసర అనుమతి!

మోడెర్నా టీకా అత్యవసర వినియోగానికి అమెరికా ఆమోదం తెలిపే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఆరోగ్య నియంత్రణ సలహా కమిటీ సమావేశం అనంతరం ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడవచ్చని ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్​​ తెలిపింది.

Moderna  vaccine could be approved for emergency use
మోడెర్నా టీకా అత్యవసర వినియోగానికి అమెరికా ఆమోదం!

By

Published : Dec 3, 2020, 5:32 AM IST

మూడో దశ ట్రయల్స్​లో 94.5 శాతం ప్రభావవంతంగా పనిచేస్తుందని తేలిన మోడెర్నా టీకాను అత్యవసర వినియోగానికి అనుమతించనుంది అమెరికా. ఆరోగ్య నియంత్రణ సలహా కమిటీ సమావేశం అనంతరం 24 నుంచి 74 గంటల్లోపు ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుంది. ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ ఈ విషయాన్ని వెల్లడించింది.

అమెరికాలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో టీకా అత్యవసర వినియోగం కాస్త ఊరటనిచ్చేలా కన్పిస్తోంది.

కొవిడ్​పై పోరాటంలో భాగంగా అమెరికా సంస్థ మోడెర్నా అభివృద్ధి చేసిన టీకా ఇటీవలే మూడోదశ ట్రయల్స్​ ప్రారంభించింది. టీకా 94.5% ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు ప్రాథమిక ఫలితాల్లో గుర్తించింది.

ఇదీ చూడండి: టీకా విషయంలో మరో శుభవార్త చెప్పిన మోడెర్నా

ABOUT THE AUTHOR

...view details