కరోనాను అరికట్టేందుకు అమెరికన్ బయోటెక్నాలజీ సంస్థ మోడెర్నా అభివృద్ధి చేస్తోన్న టీకా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రస్తుతం మూడోదశలో ఉన్న mRNA-1273 ప్రయోగాల్లో.. తాము చురుగ్గా పాల్గొంటున్నట్టు మోడెర్నా సీఈఓ స్టెఫానీ బన్సెల్ తెలిపారు. వ్యాక్సిన్ సరఫరాకు సంబంధించి ఆయా ప్రభుత్వాలతో.. ఇప్పటికే తాము ఒప్పందాలు కుదుర్చుకున్నామని ఆయన పేర్కొన్నారు.
ఈ వ్యాక్సిన్‌కు సంబంధించి ఇప్పటికే మూడో దశ నమోదు ప్రక్రియ పూర్తయిందని తెలిపారు బన్సెల్. రెండోదశ అధ్యయన ఫలితాలపై దృష్టి సారించినట్టు చెప్పారు. ఈ టీకా అధిక నాణ్యత, ప్రమాణాలతో శాస్త్రీయ పరిశోధనలకు కట్టుబడి తయారుచేస్తున్నట్లు స్పష్టం చేశారు.