కొవిడ్ నియంత్రణకు అమెరికాకు చెందిన మోడెర్నా తాము అభివృద్ధి చేసిన టీకా ప్రయోగాల ఫలితాలను.. పూర్తి డేటాను విశ్లేషించి త్వరలోనే ప్రకటించనున్నట్లు బుధవారం తెలిపింది.
మోడెర్నా 30 వేల మందిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తోంది. ఇందులో సగం మందికి వ్యాక్సిన్ ఇస్తుండగా.. మిగతా సగం మందికి ప్లాసిబో(ఎలాంటి ప్రభావం చూపని సెలైన్ లాంటి పదార్థం) అందిస్తున్నారు.
ప్రయోగాల్లో పాల్గొన్న వారిలో కనీసం 53 మంది కరోనా బారిన పడితే.. అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్డీఏ) వ్యాక్సిన్ను పరిగణనలోకి తీసుకుంటుంది.