చైనా-భారత్ మధ్య విభేదాలు ఎన్నడూ లేనంతగా ఎక్కువయ్యాయని అమెరికా అడ్మిరల్ జాన్ సీ అక్విలినో అన్నారు. అదే సమయంలో అమెరికా- భారత్ మధ్య సైనిక సంబంధాలు బాగా బలపడ్డాయని తెలిపారు. చెనా దుశ్చర్యలు, నకీలీ పనులు, అది చేసే పనుల్లో పారదర్శకత లోపించడం.. వాస్తవాధీన రేఖ వద్ద ఘర్షణ తదితర కారణాల వల్లనే భారత్.. డ్రాగన్ దేశాన్ని నమ్మడం లేదని అన్నారు. సరిహద్దులో చైనా దురాక్రమనను భారత్ అడ్డుకున్న తీరును ప్రశంసించారు.
'భారత్-చైనా మధ్య తారస్థాయిలో విభేదాలు' - అమెరికా- భారత్ సైనిక సంబంధాలు
భారత్, చైనాల మధ్య ఎన్నడూ లేనంతగా విభేదాలు తలెత్తాయని అమెరికా అడ్మిరల్ జాన్ సీ అక్విలినో తెలిపారు. సరిహద్దుల్లో చైనా దుశ్చర్యలు, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో దురాక్రమణలు.. డ్రాగన్‌ను భారత్ నమ్మకుండా చేశాయని వెల్లడించారు. అదే సమయంలో అమెరికా- భారత్ మధ్య సైనిక సంబంధాలు ఎన్నడూ లేనంతగా బలపడ్డాయని వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా చైనా 'వన్ బెల్ట్ వన్ రోడ్డు' పట్ల భారత్ అనుమానాన్ని వ్యక్తం చేస్తోందన్నారు. చైనా.. భారత్‌కే కాదు.. ఆసియా పసిఫిక్ ప్రాంతానికి ముప్పుగా పరిణమించిందని చెప్పారు. ఇండో- పసిఫిక్ ప్రాంతంలో శాంతి సుస్థిరతే అమెరికా లక్ష్యం అని తెలిపారు. ఈ ప్రాంతంలో శాంతి నెలకొల్పాలంటే భారత్- అమెరికాల మధ్య బంధం ఇలానే కొనసాగాలన్నారు. చైనా దుందుడుకు చర్యల గురించి సెనేట్ ఆర్మ్డ్ సర్వీస్ కమిలో సభ్యుడు అడిగిన ప్రశ్నకు అక్విలినో ఈ విధంగా సమాధాన మిచ్చారు.
ఇదీ చదవండి:బలగాల ఉపసంహరణపై చర్చలకు అమెరికా, ఇరాక్ సై