Miss Excel Tiktok: మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, గూగుల్ షీట్స్ గురించి ట్రిక్స్, టిప్స్ చెబుతూ విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది అమెరికా న్యూయార్క్‌కు చెందిన కేట్ నోర్టన్ అనే 27 ఏళ్ల యువతి. అదీ టిక్ టాక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఆన్లైన్ క్లాస్‌లు బోధిస్తూ.
ఇప్పుడు నెలకు రూ. కోటికిపైనే ఆర్జిస్తోంది. అదే రీతిలో సామాజిక మాధ్యమాల్లో లక్షల ఫాలోవర్లను సంపాదించుకుంది.
కాస్త బోరింగ్‌గా అనిపించే.. ఎక్సెల్, గూగుల్ స్ప్రెడ్ షీట్స్‌పై పాఠాలు చెప్పేందుకు కేట్ కార్పొరేట్ కంపెనీలో తన మంచి ఉద్యోగాన్ని వదులుకుంది. అనుకున్నదే తడవుగా దీనిపై పనిచేయడం ప్రారంభించింది.
Fun and interesting videos on Microsoft Excel programs
మొదట మిస్ఎక్సెల్ పేరిట ఇన్స్టాగ్రామ్, టిక్ టాక్‌లో ఖాతా ప్రారంభించింది. గతేడాది నవంబర్‌లో ఆన్లైన్ టీచింగ్ బిజినెస్ మొదలుపెట్టింది. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ప్రోగ్రామ్స్‌పై ఫన్నీగా డ్యాన్స్ చేస్తూ, ఆసక్తికరంగా పాఠాలు చెప్పేది. అలాగే హిడెన్ ట్రిక్స్, ఫంక్షన్స్ నేర్పించేది. పూర్తి వినోదాత్మకంగా కూడిన ఈమె క్లాస్‌లు వినేవారి సంఖ్య కొద్దిరోజుల్లోనే బాగా పెరిగిపోయింది.