అమెరికాలోని అలబామా ఎయిర్‌పోర్టకు సమీపంలో ఓ శిక్షణ విమానం కూలిపోయింది. అయితే అందులో ఎంత మంది ఉన్నారన్నదని తెలియదని వైమానిక అధికారులు తెలిపారు. పైలెట్ల పరిస్థితి గురించి కూడి ఇంకా తెలియలేదని వెల్లడించారు.
శిక్షణలో భాగంగా కొలంబియా ఎయిర్ ఫోర్స్‌కు చెందిన టీ-38 శిక్షణ ఎయిర్ క్రాప్ట్.. అలబామాలోని మోంట్గోమెరిలోని డాన్నెల్లీ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం ఐదున్నర గంటలకు కూలినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం జరగడానికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించారు.