త్వరలో అమెరికా ఉపాధ్యక్ష పదవీ చేపట్టనున్న కమలా హారిస్‌ను.. ప్రస్తుత ఉపాధ్యక్షుడు మైక్స్ పెన్స్ అభినందించారు. ఈ మేరకు ఫోన్‌చేసి ఆమెతో పెన్స్ మాట్లాడారు. గురువారం మధ్యాహ్నం వీరిరువురి మధ్య సంభాషణ జరిగినట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. క్యాపిటల్ భవనంపై దాడి అనంతరం కమల, బైడెన్ల మధ్య జరిగిన ఈ నేతల ఫోన్ సంభాషణ.. రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
కమలా హారిస్‌కు మైక్ పెన్స్ అభినందనలు
అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్.. తన స్థానంలో త్వరలో పదవీ చేపట్టనున్న కమలా హారిస్‌కు ఫోన్ చేసి అభినందించారు. క్యాపిటల్ దాడి అనంతరం కీలక నేతలు ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
అధ్యక్ష ఎన్నికల తర్వాత.. అమెరికా ప్రస్తుత పాలకులు, ఎన్నికైన నేతలకు మధ్య జరిగిన మొదటి సంభాషణ ఇదే కావడం గమనార్హం. అధ్యక్షుడిగా ట్రంప్ ఓటమి ధ్రువీకరణ అనంతరం నుంచి పలు కీలక బాధ్యతలను ఉపాధ్యక్షుడు పెన్స్ నిర్వర్తిస్తున్నారు. క్యాపిటల్ దాడి ఘటనను అదుపు చేసిన భద్రతా సిబ్బందిని ఆయనే ప్రశంసించారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతానని పెన్స్ ప్రకటించారు. మరో వైపు బైడెన్ విజయాన్ని పదపదే ప్రశ్నిస్తున్న అధ్యక్షుడు ట్రంప్.. ఈ కార్యక్రమానికి తాను హాజరు కానని ఇదివరకే స్పష్టం చేశారు. జనవరి 20న బైడెన్, కమలా హారిస్ ప్రమాణం చేయనున్నారు.
ఇదీ చూడండి:బైడెన్ ప్రమాణస్వీకారం రోజే శ్వేతసౌధం వీడనున్న ట్రంప్!