తెలంగాణ

telangana

ETV Bharat / international

కొవిడ్​ టీకా తొలి డోసు తీసుకున్న బిల్​గేట్స్​ - తొలి డోసు కొవిడ్​ టీకా తీసుకున్న బిల్​గేట్స్​

మైక్రోసాఫ్ట్​ వ్యవస్థాపకులు బిల్​గేట్స్​.. కరోనా టీకా​ తొలి డోసు తీసుకున్నారు. టీకా తీసుకోవటంపై హర్షం వ్యక్తం చేసిన గేట్స్​.. శాస్త్రవేత్తలకు కృతజ్ఞతలు తెలిపారు.

Bill Gates receives 1st dose of Covid vaccine
కొవిడ్​ టీకా తొలి డోసు తీసుకున్న బిల్​గేట్స్​

By

Published : Jan 25, 2021, 2:46 PM IST

మైక్రోసాఫ్ట్​ వ్యవస్థాపకులు బిల్​గేట్స్​ కొవిడ్-19 టీకా తొలి డోసు తీసుకున్నారు. టీకా తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు గేట్స్​. తనకు 65ఏళ్ళు ఉండటం వల్లే.. వ్యాక్సిన్​కు అర్హత పొందినట్టు ట్వీట్​ చేశారు.

"నా వయసు రీత్యా ఈ ప్రయోజనం పొందాను. తొలి డోసు వేయించుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇందుకు కృషి చేసిన శాస్త్రవేత్తలు, ప్రయోగాల్లో పాల్గొన్న వలంటీర్లు, నిర్వహకులు, ఆరోగ్య కార్యకర్తలందరికీ ధన్యవాదాలు."

- బిల్​ గేట్స్​, మైక్రోసాఫ్ట్​ వ్యవస్థాపకులు

తాము ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో సమర్థవంతమైన టీకాలు వచ్చాయని గేట్స్​ తెలిపారు. అయితే.. ఇవన్నీ త్వరలోనే మార్కెట్లోకి విడుదలైతేనే ప్రజల ప్రాణాలు నిలుస్తాయని చెప్పారు. మరోవైపు.. కరోనా మహమ్మారి వ్యాప్తి సమయంలో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొన్నారు.

మరో 250 మిలియన్​ డాలర్లు..

కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడేందుకు తమ వైపు నుంచి అదనంగా 250 మిలియన్ డాలర్లు అందిస్తామని సియాటిల్​లోని బిల్​ అండ్ మిలిందా​ గేట్స్​ ఫౌండేషన్​ ప్రకటించింది. ఇప్పటివరకు గేట్స్​ ఫౌండేషన్​ మొత్తం 1.75 బిలియన్​ డాలర్ల నిధులు సమకూర్చింది.

ఇదీ చదవండి:కమలా హారిస్​​ అధికారిక నివాసం మార్పు​-కారణమిదే?

ABOUT THE AUTHOR

...view details