తెలంగాణ

telangana

ETV Bharat / international

'మైక్రోసాఫ్ట్​ ఈమెయిల్​ సర్వర్​ హ్యాకింగ్​ చైనా పనే'

మైక్రోసాఫ్ట్​ ఎక్స్ఛేంజీ ఈమెయిల్​ సర్వర్​ హ్యాకింగ్​కు పాల్పడింది చైనానేనని ఆరోపించింది అమెరికా. డ్రాగన్​ భూభాగం నుంచి ఇతర సైబర్​ దాడులు జరుగుతున్నాయని పేర్కొంది. మరోవైపు.. యూరోపియన్​ యూనియ్​, బ్రిటన్​ దేశాలు సైతం చైనానే వేలెత్తి చూపుతున్నాయి.

Microsoft Exchange email hack
చైనా సైబర్​ దాడులు

By

Published : Jul 19, 2021, 10:46 PM IST

ఈఏడాది తొలినాళ్లలో మైక్రోసాఫ్ట్​ ఎక్స్ఛేంజీ ఈమెయిల్​ సర్వర్​ సాఫ్ట్​వేర్​ హ్యాకింగ్​ అమెరికా, ఐరోపా దేశాల్లో సంచలనంగా మారింది. వేలాది కంప్యూటర్లపై దాడి వెనుక ఉన్నది చైనానేనని తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ పరిపాలన విభాగం ఆరోపించింది.

అమెరికాతో పాటు దాని భాగస్వామ్య దేశాలు ఇతర సైబర్​ దాడులు సైతం బీజింగ్​ నుంచే జరిగాయని ఆరోపించాయి. అందులో ముఖ్యంగా సంస్థలను లక్ష్యంగా చేసుకుని మిలియన్ల డాలర్లు డిమాండ్​ చేసిన రాన్సమ్​వేర్​.. ప్రభుత్వ గుర్తుంపు పొందిన హ్యాకర్ల పనేనని పేర్కొన్నాయి. చైనా రక్షణ శాఖ క్రిమినల్​ కాంట్రాక్ట్​ హ్యాకర్స్​ను వినియోగించి సైబర్​ దాడులు చేస్తోందన్నారు అమెరికా ప్రభుత్వ సీనియర్​ అధికారి ఒకరు. హ్యాంకింగ్​పై దర్యాప్తు జరుగుతున్న తీరును వివరించారు.

మరోవైపు.. నలుగురు చైనా దేశస్థులపై చర్యలు తీసుకున్నట్లు అమెరికా న్యాయ విభాగం సోమవారం ప్రకటించింది. వారు చైనా రక్షణ శాఖ హ్యాంకింగ్​ విభాగంలో పని చేస్తూ.. డజన్ల కొద్ది కంప్యూర్​ సిస్టమ్స్​, సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నట్లు పేర్కొంది.

చైనాపైనే ఐరోపా, బ్రిటన్​ ఆరోపణ..

సైబర్​ దాడులు పెరిగిపోతున్న క్రమంలో వాటికి కారణం చైనానేనని యురోపియన్​ యూనియన్​, బ్రిటన్​లు సైతం ఆరోపించాయి. 27 దేశాల్లోని ప్రభుత్వ, రాజకీయ సంస్థలు, కీలక పరిశ్రమలే లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న సైబర్​ దాడుల వెనుక చైనా హ్యాకర్స్​ ఉన్నట్లు పేర్కొంది ఐరోపా. అమెరికా, యూరప్​లోని సముద్ర ఉత్పత్తుల పరిశ్రమలు, నౌకాదళ రక్షణ కాంట్రాక్టర్లపై సైబర్​ దాడి జరిగినట్లు యూకే జాతీయ సైబర్​ సెక్యూరిటీ కేంద్రం తెలిపింది. 'మేధో సంపత్తి చోరీ, గూఢచర్యం కోసం చైనా భూభాగం నుంచే హ్యాకింగ్​ జరిగింద'ని ఓ ప్రకటన జారీ చేశారు ఈయూ విదేశాంగ విధాన చీఫ్​ జోసెప్​ బొరెల్​.

మైక్రోసాఫ్ట్​ ఎక్స్ఛేంజీ హ్యాకింగ్​ ఈఏడాది జనవరిలో గుర్తించారు. ఆ తర్వాత చాలా ప్రైవేటు సంస్థలు వేగంగా చైనా సైబర్​ నేరగాళ్ల బారిన పడ్డాయి. ఈ క్రమంలోనే సైబర్​ దాడుల బారిన పడకుండా ఉండేందుకు ప్రభుత్వ, వాణిజ్య సంస్థలకు ప్రత్యేక వ్యూహాలు, మార్గాలను సూచించింది ఎఫ్​బీఐ, సైబర్​ సెక్యూరిటీ, ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ సెక్యూరిటీ ఏజెన్సీ. సైబర్​ దాడులపై చైనాను బాధ్యులుగా చేసేందుకు అంతర్జాతీయ కూటమికి పిలుపునిచ్చింది శ్వేతసౌధం.

ఖండించిన చైనా..

మైక్రోసాఫ్ట్​ ఎక్స్చేంజీ హ్యాకింగ్​ అంశాన్ని ఖండించారు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి. 'ఈ అంశాన్ని చైనా ఖండిస్తోంది. సైబార్​ దాడులు, సైబర్​ తెఫ్ట్​లపై​ మేం పోరాడుతున్నాం. ఆధారాలు ఉంటేనే నిందించాలి కానీ, నిరాధారమైన ఆరోపణలతో కాదు' అని హెచ్చరించారు.

ఇదీ చూడండి:పంథా మార్చిన సైబర్ క్రైమ్స్​- ఇలా జాగ్రత్తపడండి..

ABOUT THE AUTHOR

...view details