అమెరికా మిషిగన్‌కు చెందిన ఓ జంట ఆడబిడ్డ కోసం సంవత్సరాల పాటు ఎదురుచూశారు. దాదాపు 30 ఏళ్లకు వారి కల నెరవేరింది. తాజాగా ఆ చిన్నారి రాకతో ఆ కుటుంబసభ్యులు సంబురాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఆ దంపతులకు 14 మంది అబ్బాయిలు ఉండటం విశేషం.
45 ఏళ్ల వయస్సులో...
45ఏళ్ల జే ష్వాండ్ట్స్ - కటెరి దంపతులకు గురువారం పండంటి ఆడబిడ్డ జన్మించింది. ఆమెకు మ్యాగీ జేన్ అని పేరు పెట్టారు. కుటుంబంలోకి మ్యాగీని ఆహ్వానించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు జే.