తెలంగాణ

telangana

ETV Bharat / international

మెక్సికోలో కాల్పులు- 16నెలల చిన్నారి సహా 8మంది మృతి - మెక్సికో కాల్పుల ఘటన

Mexico Shooting: మెక్సికోలో జరిగిన కాల్పుల ఘటనలో 16నెలల చిన్నారి సహా 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఓ ఇంట్లో ఉండే వ్యక్తులు లక్ష్యంగా కాల్పులు జరిగాయి. గాయపడ్డ మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.

Mexico Silao Gun attack
MEXICO-VIOLENCE

By

Published : Dec 30, 2021, 6:33 AM IST

Mexico shooting: మెక్సికోలో కాల్పుల మోత మోగింది. నగరంలోని నార్త్ సెంట్రల్ ప్రాంతంలో మంగళవారం జరిగిన ఈ దాడిలో ఎనిమిది మంది మరణించారు. మృతుల్లో 16 నెలల చిన్నారి ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

Mexico Silao Gun attack

సిలావో శివారు ప్రాంతంలోని ఓ ఇంట్లో ఉన్న నలుగురు పురుషులే లక్ష్యంగా సాయుధులు ఈ దాడి చేశారని అధికారులు తెలిపారు. కాల్పుల్లో ఆ నలుగురితో పాటు ఓ మహిళ సైతం ప్రాణాలు కోల్పోయిందని వెల్లడించారు. ఘటనలో గాయపడ్డ మరో వ్యక్తి బుధవారం మరణించాడని చెప్పారు. గాయపడ్డ మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, వారి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.

చిన్నారులు సైతం..

ఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలోని మరో ఇంట్లో.. 16 ఏళ్ల బాలిక, 16 నెలల బాలుడి మృతదేహాలు కనిపించాయని అధికారులు వెల్లడించారు. వీరి బాడీలపై బుల్లెట్ గాయాలు ఉన్నాయని చెప్పారు. ఉద్దేశపూర్వకంగానే వీరిని చంపారా? లేదంటే అనుకోకుండా బుల్లెట్లు తగలడం వల్ల చిన్నారులు మరణించారా అనే విషయంపై స్పష్టత లేదన్నారు. కాల్పులు జరిగిన ఇంటిని డ్రగ్ బానిసలు ఉపయోగిస్తున్నారని స్థానిక మీడియా తెలిపింది.

'వారికి ఇక్కడ చోటు లేదు'

ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన రాష్ట్ర అంతర్గత వ్యవహారాల కార్యదర్శి లిబియా గార్సా.. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని స్పష్టం చేశారు. మనుషుల ప్రాణాలను తీసే వ్యక్తులకు సిలావోలో చోటు లేదని అన్నారు.

ఇదీ చదవండి:ప్రపంచంపై మరోసారి కరోనా పంజా- వారంలోనే 11% పెరిగిన కేసులు

ABOUT THE AUTHOR

...view details