తెలంగాణ

telangana

ETV Bharat / international

పజిల్స్​తో జైలు గోడలు బద్దలు కొట్టేయండిలా! - ఎల్​ చాపో

పజిల్​ గేమ్స్​ అంటే... రూబిక్స్​ క్యూబ్​, సుడోకూ లాంటివే గుర్తొస్తాయి. కానీ మెక్సికోలో మాత్రం జైలే పజిల్​. అందులో నుంచి తప్పించుకుని వస్తే గెలిచినట్లే. కానీ అది అంత సులువు కాదు. ఎందుకంటే ఆ ఆట రూపకల్పనకు స్ఫూర్తి ఎవరో తెలుసా? డ్రగ్​ మాఫియా కింగ్​ ఎల్​ చాపో!

పజిల్స్​తో జైలు గోడలు బద్దలు కొట్టేయండిలా!

By

Published : Jul 20, 2019, 3:39 PM IST

పజిల్స్​తో జైలు గోడలు బద్దలు కొట్టేయండిలా!

ఎల్​ చాపో అలియాస్​... జోక్విన్​ గుజ్​మన్​. మెక్సికో మాదక ద్రవ్యాల మాఫియా అధిపతి. అగ్రరాజ్యం అమెరికానూ నానా ఇబ్బందులు పెట్టిన నేరస్థుడు.

అమెరిగా డ్రగ్స్​ మాఫియా మోస్ట్​ వాంటెడ్​ లిస్టులో మెదటి స్థానం ఎల్​ చాపోదే. మత్తు పదార్ధాల వ్యాపారం, ఎదురొచ్చిన వాళ్లను చంపడం, అవినీతి వంటి వందలాది కేసుల్లో అతడు నిందితుడు. 2016లో మెక్సికోలోనే ఎంతో కట్టుదిట్టమైన జైలు నుంచి సొరంగ మార్గాన్ని ఏర్పరచుకొని ఎంతో చాకచక్యంగా తప్పించుకున్నాడు. ఇప్పటికీ అతను ఎలా తప్పించుకోగలిగాడో పోలీసులకు అంతుచిక్కడం లేదు.

"ఒక్కసారి చాపో తప్పించుకున్న విధానాన్ని గుర్తు తెచ్చుకుంటే... అతడు సొరంగ మార్గాన్ని ఎలా తవ్వాడు? భద్రతా సిబ్బంది కళ్లు కప్పి ఆ పని ఎలా చేయగలిగాడు అనే ప్రశ్నలు ఎంతో ఆసక్తికరమైనవి".

-ఓస్వాల్డో జవాలా, రచయిత

చావో తప్పించుకోవడం ఇప్పటికీ ఓ మిస్టరీ. ఈ మర్మమే... ఇప్పుడో రియాల్టీ పజిల్​ గేమ్​లా మారింది. ఎస్కేప్​ 60 అనే సంస్థ మెక్సికో నగరంలో ఇందుకోసం ప్రత్యేక జైలును రూపొందించింది. గదిలో నుంచి బయటకు రావడానికి 60 నిమిషాలే గడువు. ఆ సమయంలోనే పజిల్స్​ ఛేదించి 14 స్టేజ్​లను దాటుకుని విజయం సాధించాలి.

"మీరు మీ జట్టుతో గదిలో ప్రవేశించాక కొన్ని క్లూస్​ ద్వారా పజిల్స్​ను పరిష్కరించాలి. దాని సాయంతో ఒక్కో గదిని దాటుకుంటూ రావాలి. మీకు ప్రత్యర్థిగా ఉన్న జట్టు​ మీ గదిలో కష్టమైన పజిల్స్​ను సృష్టిస్తారు. కాబట్టి ఇది చాలా తెలివితో ఆడాల్సిన ఆట."

-రిచర్డో పడిల్లా, ఎస్కేప్​ 60 నిర్వాహకుడు

ఒక్క జైలు బ్రేక్​ మాత్రమే కాదు ది ఫిఫ్త్ సాకర్​ గేమ్​, కిచెన్​ ఎస్కేప్​ లాంటి ఇతర చాలెంజ్​ ఆటలను కూడా ప్రవేశపెట్టారు. కానీ వాటన్నింటిలోకెల్లా జైలు బ్రేక్​ చాలెంజ్​ చాలా కష్టమైనది. ఇప్పటి వరకు ఈ గేమ్​ ఆడిన వారిలో 15 శాతం మాత్రమే గెలిచారంటే ఎంత క్లిష్టమైనదో తెలుస్తోంది. ఈ ఆట ఆడాలంటే 15 డాలర్లు చెల్లించి టికెట్​ తీసుకోవాలి.

"ఇక్కడ సృష్టించిన వాతావారణం చాలా బాగుంది. మిమ్మల్ని ఇది వాస్తవానికి దగ్గరగా తీసుకెళ్తుంది. ఇచ్చే క్లూస్​ కానీ, సవాళ్లు కానీ ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తాయి".

-ఫెలిపే క్యూరీ, ఎస్కేప్​ 60 ఆటగాడు

వినోదాన్ని పంచే ఈ గేమ్​ సృష్టికి కారణమైన ఎల్​ చాపో... ప్రస్తుతం న్యూయార్క్​ మన్​హాటన్​ జైలులో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉన్నాడు. హత్యకు కుట్ర, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసుల్లో దోషికి తేలిన అతడికి న్యూయార్క్​ న్యాయస్థానం వచ్చే బుధవారం శిక్ష ఖరారు చేయనుంది.

ఇదీ చూడండి:చంద్రయాన్​: తొలి అడుగుకు అర్ధ శతాబ్దం

ABOUT THE AUTHOR

...view details