మెక్సికోలోని సిలయా ప్రాంతంలోకి గురువారం అర్ధరాత్రి జరిగిన గ్యాంగు ఘర్షణల్లో 9మంది మరణించారు. ఈ దాడుల వెనుక ఎవరున్నారనేది తెలియదని పోలీసులు వెల్లడించారు.
భీతావహ దృశ్యం..
రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో ఈ మరణాలు సంభవించి ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటివరకూ ఏ ఒక్క ముఠా ఈ ఘర్షణలకు బాధ్యత వహించకపోవటం గమనార్హం. సంఘటనా స్థలంలో చెల్లాచెదురుగా పడిఉన్న మృతదేహాలను, భీతావహ దృశ్యాలను స్థానిక మీడియా వెలుగులోకి తీసుకొచ్చింది.