అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈనెల 24, 25 తేదీల్లో భారత్‌లో పర్యటించనున్నారు. ట్రంప్‌తో పాటే ఆయన భార్య మెలానియా ట్రంప్ కూడా భారత్‌కు వస్తున్నారు. పర్యటనలో భాగంగా ఆమె దిల్లీలోని ఓ ప్రభుత్వ పాఠశాలను సందర్శించనున్నట్లు తెలుస్తోంది.
ఈ నెల 24న అహ్మదాబాద్‌లో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద మోటేరా స్టేడియాన్ని ట్రంప్ ప్రారంభించనున్నారు. అహ్మదాబాద్ పర్యటన అనంతరం దిల్లీకి చేరుకోనున్నారు.