అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిపాలైన ట్రంప్‌కు మరొక ఎదురుదెబ్బ తగలనుందా? అంటే అవునంటోంది ఓ బ్రిటీష్ మీడియా సంస్థ. ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవి నుంచి తప్పుకోగానే.. తన భార్య మెలానియా ట్రంప్ విడాకులు తీసుకోనుందట. ఇందుకోసమే ట్రంప్ శ్వేతసౌధం నుంచి ఎప్పుడెప్పడు బయటకు వస్తారా? అని మెలానియా ఎదురుచూస్తున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో విడిపోతే తన అధికార బలంతో ట్రంప్ ఏమైనా చేయొచ్చని మెలానియా భావిస్తున్నారట.
విడాకులు తీసుకోనున్న ట్రంప్ దంపతులు! - Melania to seek divorce from Donald trump
అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరలో విడిపోనున్నారట. ఈ విషయాన్ని ఓ బ్రిటీష్ మీడియా సంస్థ తెలిపింది. ట్రంప్ శ్వేతసౌధం నుంచి బయటకు వచ్చిన వెంటనే ఇద్దరూ విడాకులు తీసుకోనున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది.
విడాకులు తీసుకోనున్న ట్రంప్ దంపతులు !
ట్రంప్-మెలానియా 2005లో వివాహం చేసుకున్నారు. డొనాల్డ్ ట్రంప్‌కు మెలానియా మూడో భార్య కాగా వీరికి బారన్ ట్రంప్ అనే కుమారుడు ఉన్నాడు.
మరోవైపు మెలానియా మాజీ సలహాదారు స్టెఫానీ వాల్కాఫ్ 'మెలానియా అండ్ మీ' అనే పుస్తకాన్ని విడుదల చేశారు. ఇందులో ట్రంప్ దంపతులకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను ప్రస్తావించారు. మెలానియా తన కుమారుడు బారన్‌కు ఆస్తిలో వాటా ఇస్తేనే.. శ్వేతసౌధంలోకి అడుగుపెడతానని ట్రంప్‌తో ఒప్పందం చేసుకున్నట్లు స్టెఫానీ ఆ పుస్తకంలో పేర్కొన్నారు.