తెలంగాణ

telangana

ETV Bharat / international

'ఒమిక్రాన్‌పై ప్రస్తుత ఔషధాల పనితీరు భేష్‌' - కొత్త వేరియంట్​ పై ఔషధాల పనితీరు

medicine for covid omicron: ఒమిక్రాన్‌ వేరియంట్‌పై ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఔషధాలు అన్నీ మెరుగైన పని తీరును ప్రదర్శిస్తున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. యాంటీబాడీ చికిత్సలు మాత్రం ఈ వేరియంట్‌ బాధితులపై అంతగా పనిచేయడం లేదని పరిశోధకులు తెలిపారు. కొన్నిరకాల యాంటీబాడీలు ఒమిక్రాన్‌ను ఎదుర్కోవడంలో పూర్తిగా విఫలమవుతున్నట్టు నిర్ధారణకు వచ్చారు.

OMICRON
ఒమిక్రాన్

By

Published : Jan 28, 2022, 5:40 AM IST

medicine for covid omicron: ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొవిడ్‌-19 ఔషధాలు ఒమిక్రాన్‌ వేరియంట్‌పై అత్యంత ప్రభావంగా పనిచేస్తున్నట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది. అయితే, యాంటీబాడీ చికిత్సలు మాత్రం ఈ వేరియంట్‌ బాధితులపై అంతగా పనిచేయడం లేదని తేలింది. కొన్నిరకాల యాంటీబాడీలు ఒమిక్రాన్‌ను ఎదుర్కోవడంలో పూర్తిగా విఫలమవుతున్నట్టు పరిశోధకులు నిర్ధారణకు వచ్చారు. యూనివర్సిటీ ఆఫ్‌ విస్కాన్సిన్‌-మాడిసన్‌కు చెందిన వైద్య పరిశోధకుడు యోషిహిరో కవాకా ఈ అధ్యయనానికి నేతృత్వం వహించారు. ఇందుకు సంబంధించిన వివరాలను 'న్యూ ఇంగ్లండ్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడిసిన్‌' అందించింది.

'మిగతా వేరియంట్లు, ఒమిక్రాన్‌ సోకిన వారికి వివిధ కొవిడ్‌ చికిత్సలు ఎలా పనిచేస్తున్నాయన్న విషయమై అధ్యయనం సాగించాం. ఒమిక్రాన్‌ పుట్టుకురావడానికి ముందే... కొవిడ్‌ నియంత్రణకు పలురకాల ఔషధాలు, యాంటీబాడీ థెరపీలను వైద్య నిపుణులు సూచించారు. కొత్త వేరియంట్‌లో మ్యూటేషన్లు విభిన్నంగా ఉండటంతో... ఈ ఔషధాలు, చికిత్సలు ఎంతవరకూ పనిచేస్తాయన్న ఆందోళన నెలకొంది.

దీంతో జపాన్‌కు చెందిన జాతీయ సాంక్రమిక వ్యాధుల పరిశోధన సంస్థ నిపుణులతో కలిసి.. వుహాన్‌, ఇతర ముఖ్యమైన వేరియంట్లపై వీటి పనితీరును తెలుసుకునేందుకు ప్రయత్నించాం. ప్రయోగశాలలో చేపట్టిన పరీక్షల్లో... మోల్నుపిరావిర్‌, రెమిడెసివిర్‌ ఔషధాలు ఒమిక్రాన్‌ సహా అన్ని వేరియంట్లపైనా ఒకే విధంగా పనిచేస్తున్నట్టు గుర్తించాం.

ఫైజర్‌ సంస్థ తయారుచేసిన పాక్స్‌లోవిడ్‌ మాత్ర, ఇంజక్షన్లు.. గ్లాక్సో స్మిత్‌క్లైన్‌ రూపొందించిన సోట్రోవిమాబ్‌, ఆస్ట్రాజెనికా సంస్థ తయారుచేసిన ఎవిషెల్డ్‌ ఔషధం ఒమిక్రాన్‌ బాధితులకు ఎక్కువ మోతాదులో అవసరమవుతాయని గుర్తించాం' అని యోషిహిరో వివరించారు. ఇవన్నీ ప్రయోగశాల స్థాయి ఫలితాలేనని, క్షేత్రస్థాయి ప్రయోగాల్లో భిన్న ఫలితాలు నమోదయ్యే అవకాశముందని తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి:మంచు బంతులతో ఉల్లాసంగా.. ఉత్సాహంగా..

ABOUT THE AUTHOR

...view details