నవంబర్ 3న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం ప్రచార పర్వాన్ని ఉద్ధృతం చేశారు ట్రంప్. బైడెన్ చేతిలో తాను ఓడిపోతే.. అమెరికాను వదిలేసి వెళ్తానని చమత్కరించారు. జార్జియా, మకోన్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
" నేను మీతో సరదాకి చెప్పడం లేదు. అధ్యక్ష ఎన్నికల చరిత్రలో ఒక అసమర్థ అభ్యర్థితో పోటీ పడుతుండడం.. నాకు ఒత్తిడి కలిగిస్తోంది. నేను ఒక వేళ ఓడిపోతే ఏం చేస్తానో మీరు ఊహించగలరా..? బహుశా నేను అమెరికాను విడిచి వెళ్తానేమో! నాకూ తెలియదు. "
-- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
'నేను ఆమోదిస్తున్నాను..'
ట్రంప్ వ్యాఖ్యలపై తనదైన రీతిలో ట్విట్టర్ వేదికగా సమాధానమిచ్చారు డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్. 'నేను జో బైడెన్. నేను దీనికి ఆమోదిస్తున్నాను' అని వ్యాఖ్యానించారు.
గతంలోనూ..
ట్రంప్ గత నెలలో నార్త్ కరోలినాలో ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలనే తాజాగా మళ్లీ చేశారు. 'నేను బైడెన్ చేతిలో ఓడిపోతే.. నేనేం చేస్తానో నాకే తెలియదు. నేను మీతో మళ్లీ మాట్లాడను' అని అప్పుడు ఆయన అన్నారు.
2016 ఎన్నికల ప్రచారంలోనూ ట్రంప్ ఇలాగే అన్నారు ట్రంప్. తాను రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష బరిలో ఓటమి పాలైతే ప్రజలకు కనిపించకుండా ఉంటానని చెప్పారు.
ఇదీ చూడండి:రంగంలోకి ఒబామా- జోరుగా సాగుతున్న ఎన్నికల ప్రచారం