అమెరికా న్యూయార్క్ రాష్ట్రంలో కాల్పుల ఘటన మరోసారి కలకలం సృష్టించింది. రొచెస్టర్ నగరంలోని గూడ్‌మాన్ స్ట్రీట్‌లో అర్థరాత్రి సమయంలో కొందరు దుండగులు ఒక్కసారిగా స్థానికులపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఇద్దరు పౌరులు అక్కడికక్కడే మృతిచెందగా, మరో పదిమంది గాయపడ్డట్లు సమాచారం. అయితే, కాల్పులకు పాల్పడింది ఎవరనే విషయం మాత్రం ఇంకా తెలియలేదు.
అమెరికాలో కాల్పుల కలకలం- ఇద్దరు మృతి - న్యూయార్క్ కాల్పులు
అమెరికా న్యూయార్క్ రాష్ట్రంలో అర్థరాత్రి కొందరు దుండగులు... స్థానికులపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు పౌరులు మరణించారు. మరో పది మంది గాయపడ్డారు. అయితే కాల్పులకు కారణం ఎవరనేది ఇంకా తెలియరాలేదు.
అమెరికాలో కాల్పుల కలకలం- ఇద్దరు మృతి
వరుస కాల్పులతో ఆ ప్రాంతంలోని ప్రజలంతా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైనట్లు ప్రత్యక్షసాక్షులు వెల్లడించారు. ఘటనాస్థలికి వెంటనే చేరుకున్న పోలీసులు... దుండగుల కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టారు. ఈ కాల్పుల ఘటన పెద్ద ప్రమాదంగానే పోలీసులు ప్రకటించారు. ముందుజాగ్రత్తగా ఆ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకున్న రొచెస్టర్ పోలీసులు... ఘటనపై పూర్తి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి:'ఇండో అమెరికన్లకు 'కమల' ఎప్పుడూ దూరమే'