అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న ప్రతిపాదనలకు చైనా అడ్డుపుల్ల వేయటం విస్మయానికి గురిచేసిందని అమెరికా పత్రిక పేర్కొంది. "జిహాదీలకు చైనా గొడుగు-కశ్మీర్ హంతకుడిపై ఆంక్షలు విధించేందుకు చైనా అడ్డుపుల్ల" శీర్షికతో సంపాదకీయంలో ప్రముఖంగా రాసింది.
'మసూద్‌పై చైనా గొడుగు ఎందుకు?' - చైనా
జైషే మహ్మద్ అధినేత మసూద్ అజార్ వ్యవహారంలో చైనా వైఖరిని 'వాల్‌స్ట్రీట్' జర్నల్ తప్పుబట్టింది. ప్రమాదకారి అని తేలినప్పటికీ అజార్‌కు డ్రాగన్ దేశం గొడుగు పడుతోందని విమర్శించింది.
జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్
కథనంలో పేర్కొన్న అంశాలు
- ప్రపంచ దేశాలు పాక్‌పై ఒత్తిడి తెస్తుంటే చైనా వాటిని తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది.
- పాకిస్థాన్‌తో సంబంధాల కోసం పదేళ్లుగా అజార్‌పై వస్తోన్న ప్రతిపాదనలను చైనా తిరస్కరిస్తోంది.
- ఉగ్రవాదంపై అర్థవంతమైన చర్యలు తీసుకోకపోతే దానికి పరిష్కారంగా సైనిక చర్య తప్ప మరే ప్రత్యామ్నాయం లేదని భారత్ భావిస్తుంది.
- పాకిస్థాన్ వైఖరితో విసిగిపోయిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఆ దేశానికి అందిస్తోన్న సైనిక సాయంలో గతేడాది కోత విధించారు. అయితే ఆ లోటును చైనా పూరిస్తోంది.
ఇదీ చూడండి:ఉగ్రవాదంపై చర్చకు 'బ్రిక్స్' పచ్చజెండా