తెలంగాణ

telangana

ETV Bharat / international

నానో ఫైబర్​ ఫిల్టర్లతో కరోనాకు 100% అడ్డుకట్ట!

గాలి తుంపర్ల ద్వారా వ్యాపించే కరోనా వైరస్​ను పూర్తిస్థాయిలో అడ్డుకునే సామర్థ్యమున్న నానోఫైబర్​ ఫిల్టర్లను పరిశోధకులు తయారు చేశారు. పాలిమర్​ సూక్ష్మ దారాలను ఉపయోగించి తయారు చేసిన ఈ ఫిల్టర్లు 99.9% కంటే ఎక్కువగా వైరస్​ను అడ్డుకుంటున్నాయని వారు చెబుతున్నారు.

corona, covid, virus
కరోనా

By

Published : May 20, 2021, 7:09 AM IST

గాలి తుంపర్ల ద్వారా వ్యాపించే కరోనా వైరస్​ను నానోఫైబర్​ ఫిల్టర్లు పూర్తి స్థాయిలో అడ్డుకోగలవని తాజా పరిశోధనలో రూఢి అయింది. పాలిమర్​ సూక్ష్మ దారాలను ఉపయోగించి శాస్త్రవేత్తలు ఈ ఫిల్టర్లను తయారు చేశారు. కరోనా సోకిన వ్యక్తి మాట్లాడినా, దగ్గినా, తుమ్మినా, చీదినా, పాడినా.. ముక్కు, నోటి నుంచి వెలువడే గాలి తుంపర్లలో కలిసి వైరస్​ బయటకు వస్తుంది. తర్వాత గాలిలో ప్రయాణించి సమీపంలో ఉన్న వ్యక్తులకు సోకుతుంది. మాస్కులు ధరించడం ద్వారా ఈ వైరస్​ను అడ్డుకోవచ్చు. అయితే.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మాస్కులేవీ వైరస్​ను మహమ్మారి నుంచి పూర్తిస్థాయి రక్షణ కల్పించటం లేదు. దీంతో యూసీ రివర్​సైడ్​, ద జార్జ్​ వాషింగ్టన్​ వర్సిటీ ఇంజినీరింగ్​ పరిశోధకులు దీనిపై దృష్టి సారించారు.

"తల వెంట్రుక మందంలో 167వ భాగమంతా సన్నగా ఉండే స్పన్​ దారాల గుండా ఒక్క చుక్క ద్రవరూప పాలీవినిలిడెన్​ ఫ్లోరైడ్​ను, హెచ్చుస్థాయి విద్యుత్తును ప్రసరింప చేయడం ద్వారా నానోఫైబర్​ ఫిల్టర్లను తయారు చేశాం. ఎలక్ట్రోస్పిన్నింగ్​గా పిలిచే ఈ ప్రక్రియ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. మాస్కుల తయారీలో, వాయు నియంత్రణ వ్యవస్థల్లో భారీగా ఉపయోగించడానికి ఇది అనువుగా ఉంటుంది. సాధారణ మాస్కులు గాలి తుంపర్లలోని కరోనా వైరస్​ను 45%-73% వడపోస్తే.. సర్జికల్​ మాస్కులు 98% రక్షణ కల్పిస్తున్నాయి. మేము తయారు చేసిన నానో ఫైబర్​ ఫిల్టర్లు 99.9% కంటే ఎక్కువగా వైరస్​ను అడ్డుకుంటున్నాయి."

-యాన్​ షెన్​, పరిశోధనకర్త.

ఈ నానోఫైబర్ ఫిల్టర్లతో తయారైన మాస్కులను ధరిస్తే శ్వాస తీసుకోవడం కూడా సులభంగా ఉంటుందట!

ఇదీ చూడండి:వీడని వూహాన్ ల్యాబ్ మిస్టరీ!

ఇదీ చూడండి:భారత్​ ప్రతిస్పందనపై సింగపూర్​ సంతృప్తి

ABOUT THE AUTHOR

...view details