కరోనా వైరస్ వ్యాప్తిని మాస్కులు, చేతి తొడుగులు ఆపలేవని, వీటికి చాలా పరిమితులు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన నిపుణులు తేల్చి చెప్పారు. జనసందోహం ఎక్కువగా ఉన్న చోట వీటిని ధరించడం వల్ల ఉపయోగం లేకపోగా, వైరస్ మరింత వేగంగా వ్యాపించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
కరోనా విజృంభణతో ఇటలీ, స్పెయిన్, తాజాగా ఫ్రాన్స్ పూర్తిగా స్తంభించిపోయాయి. అయినప్పటికీ డబ్ల్యూహెచ్ఓ ఈ వైరస్ నివారణ కోసం తాము మొదట్నుంచి చేస్తున్న సూచనల్లో ఎలాంటి మార్పు చేయలేదని తెలిపారు.
"కరోనా వ్యాప్తి నివారణకు.. మీ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ముఖాన్ని తాకొద్దు. ఇతరుల నుంచి కొంచెం దూరంగా ఉండాలి. మీకు వైరస్ సోకినట్లు భావిస్తే, బయటకు వెళ్లినప్పుడు మాస్కులు ధరించండి. లేదంటే సాధ్యమైనంత వరకు ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉండటం మంచిది."
- మైక్ ర్యాన్, డబ్ల్యూహెచ్ఓ ఎమర్జెన్సీస్ డైరెక్టర్
సలహాలు పాటించకపోతే ఎలా?
కరోనా వైరస్ సహజంగా చర్మ స్పర్శ, శ్లేష్మం, చెవులు, కళ్లు, ముక్కు ద్వారా వ్యాపిస్తుంది. అయితే చాలా మంది నిపుణుల సూచనలు పాటించరు. అందువల్ల వారు మాస్కులు ధరించడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు.