అంగారక గ్రహం ఉపరితలం కింద పురాతన జలాలు భారీగా దాగి ఉండొచ్చని తాజా అధ్యయనంలో పరిశోధకులు అభిప్రాయపడ్డారు. కొన్ని లక్షల సంవత్సరాల కిందట అంగారకుడిపై భారీగా నీరు ప్రవహించేదని చెప్పడానికి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. అక్కడి లోతైన సముద్రాలు, నదులు, సరస్సులు ఎలా ఎండిపోయాయన్నది శాస్త్రవేత్తలకు ఇంకా పూర్తిస్థాయిలో అంతుచిక్కడంలేదు. అయితే.. ఆ నీరంతా అంతరిక్షంలోకి వెళ్లిపోయిందని గతంలో కొన్ని పరిశోధనలు పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నాసా శాస్త్రవేత్తలు దీనిపై దృష్టి సారించారు.
అంగారకుడి గర్భంలో జలసిరి! - మార్స్‌పై నీరు అంశంపై అధ్యయనం
అంగారక గ్రహంపై కొన్ని సంవత్సరాల కిందట భారీగా నీరు ప్రవహించేదని చెప్పడానికి ఆధారాలున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. అయితే.. దీనిపై కాలిఫోర్నియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నాసా శాస్త్రవేత్తలు అధ్యయనం చేసి కొన్ని విస్తుపోయే నిజాలు వెల్లడించారు.
"40 లక్షల సంవత్సరాల కిందట అంగారకుడిపై అక్కడి భూమిలో 100 నుంచి 1500 మీటర్ల లోతువరకు నీళ్లుండేవి. అందులో ఇప్పుడు 30 శాతం నుంచి 99 శాతం వరకూ జలాలు ఉపరితలం కింది భాగంలో ఖనిజ పదార్థాలతో కలిసిపోయి ఉండొచ్చు. అంగారకుడిపై జలాలు కాలక్రమంలో ఆవిరిగా, ద్రవంగా, మంచుగా, రసాయన రూపంగా ఎలా మారిపోయి ఉండొచ్చన్నది అంచనా వేశాం. మార్స్ రోవర్, ఉపగ్రహాలు పంపిన సమాచారాన్ని కూడా విశ్లేషించాం. ఆ గ్రహ గర్భంలో నీరు ఉండి ఉండొచ్చని భావిస్తున్నాం" అని పరిశోధనకర్త బేతనీ ఎహెల్మాన్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి:'శ్రీలంక చైనా గుప్పిట్లో లేదు'