మానవాళిపై కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకూ మరింత తీవ్రమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల 61 లక్షల 54 వేలు దాటింది. ఇప్పటి వరకు మొత్తం 3.70లక్షల మంది కొవిడ్-19తో మృతి చెందగా.. 27.34లక్షల మంది కోలుకున్నారు.
ప్రపంచవ్యాప్తంగా 61 లక్షలు దాటిన కరోనా కేసులు - అమెరికాలో కరోనా కేసుల సంఖ్య
ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి రోజురోజుకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,24,103 కొవిడ్-19 కేసులు నమోదయ్యాయి. వేల మంది మహమ్మారి ధాటికి ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 61 లక్షల 54 వేలు దాటింది.
అమెరికా, బ్రెజిల్, రష్యా, స్పెయిన్‌లో వైరస్ ఉద్ధృతి ఆందోళనకరంగా ఉంది. గడిచిన 24 గంటల్లో బ్రెజిల్లో అత్యధికంగా 30 వేలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి బ్రెజిల్లో కరోనా బాధితుల సంఖ్య 5 లక్షలకు చేరువైంది. అమెరికాలోనూ కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. అగ్రరాజ్యంలో 24 గంటల్లో 23 వేల మందికిపైగా కరోనా నిర్ధరణ అయ్యింది. యూఎస్‌లో మొత్తం కేసుల సంఖ్య 18 లక్షల 16 వేలు దాటింది. కాగా కొవిడ్-19 కారణంగా తాజాగా 1,015 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చూడండి:10 నిమిషాల్లోనే కరోనా నిర్ధరణ !