అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా.. సముద్రపు జీవితో నిరసన తెలియజేశారు కొందరు ఆగంతుకులు. 'మనటీ' అని పిలిచే భారీ జలచర జంతువుపై ట్రంప్ పేరును ఆంగ్లంలో చెక్కారు. ఫ్లోరిడాలోని హోమోససా నదిలో అమెరికా మత్స్య, వణ్యప్రాణి సేవల సిబ్బంది ఈ జీవిని గుర్తించారు. దీనికి కారణమైనవారిని కనిపెట్టే పనిలో పడ్డారు అధికారులు.
అంతరించిపోతున్న ఈ జీవులను హింసించినందుకు నిందితులు క్లాస్-ఏ క్లిమినల్ కేసు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నేరారోపణ రుజువైతే 50 వేల డాలర్లు జరిమానా, ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష విధిస్తారు.