తెలంగాణ

telangana

ETV Bharat / international

60సెకన్లలో 32టీషర్ట్‌లు.. ఇది వరల్డ్​ రికార్డు గురూ! - గిన్నీస్​ రికార్డు టీషర్టులు

60సెకన్లలో 32 టీషర్టులు ధరించి గిన్నిస్​ వరల్డ్​ రికార్డు సృష్టించారు అమెరికాకు చెందిన డేవిడ్​ రష్​ దంపతులు. డేవిడ్​ టీషర్టులు ధరిస్తుండగా.. ఆయన భార్య జెన్నీఫర్​ వెనుక నుంచి సాయం చేశారు. వీరు గతంలోనూ అనేక రికార్డులను బద్దలు కొట్టారు.

Man wears 32 Tshirts n 60seconds to create wold record
60సెకన్లలో 32టీషర్ట్‌లు.. ఇది వరల్డ్​ రికార్డు గురూ!

By

Published : Jun 6, 2020, 11:12 PM IST

లాక్‌డౌన్‌ ప్రజల్లోని కొత్త కళల్ని వెలికితీస్తోంది. కొందరు కొత్త విద్యలు నేర్చుకుంటుంటే.. మరికొందరేమో ఉన్న నైపుణ్యానికి పదునుపెట్టి రికార్డులు సృష్టిస్తున్నారు. అమెరికాలోని లాస్​ఏంజెల్స్​కు చెందిన డేవిడ్‌ రష్‌ దంపతులు 60 సెకన్లలో 32 టీషర్ట్‌లు ధరించి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డును సృష్టించారు. గతంలో ఉన్న 31టీషర్ట్‌ల రికార్డును అధిగమించారు. నేలపై పరిచిన టీషర్ట్‌లను డేవిడ్‌ వేగంగా ధరిస్తుండగా.. ఆయన భార్య జెన్నీఫర్‌ వెనుక నుంచి సాయం చేశారు. ఇలా ఇద్దరు కలిసి.. ఒక్క నిమిషంలో గత రికార్డును బ్రేక్‌ చేశారు.

స్టెమ్​(సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, మ్యాథ్స్‌) ఎడ్యుకేషన్‌ను ప్రమోట్‌ చేస్తూ.. డేవిడ్‌ ఇప్పటికే 100 గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులను సృష్టించారు. వీటికి సంబంధించిన వీడియోలు గతంలో వైరల్‌ అయ్యాయి. తను నెలకొల్పిన పలు రికార్డుల కోసం తన సతీమణి చాలా సహకరించారని, కానీ ఆమె పేరును అధికారికంగా జాబితాలో రాయలేదని డేవిడ్‌ ఈ సందర్భంగా చెప్పారు. ‘జెన్నీఫర్‌ నా వెనుక నుంచి టీషర్ట్‌ను బలంగా లాగింది. కేవలం ఒక మూమెంట్‌తో టీషర్ట్‌ను పూర్తిగా కిందికి లాగడం విశేషం’ అని చెప్పారు. ఇటీవల డేవిడ్‌ మరో రికార్డును సృష్టించారు. షేవింగ్‌ క్రీమ్‌ను తన స్నేహితుడి తలపై వేసి.. ఆ నురగలో బాల్స్‌ నిలిచేలా దూరం నుంచి విసిరాడు. ఈ వీడియోలను ఆయన తన యూట్యూబ్‌ ఖాతాలో అప్‌లోడ్‌ చేశారు.

ABOUT THE AUTHOR

...view details