తెలంగాణ

telangana

ETV Bharat / international

బామ్మ కోసం.. 220 మైళ్లు పరిగెత్తిన మనవడు​! - gradmother in hospital

కన్నవారినే కానివారిగా చూస్తూ.. దూరం పెట్టే తనయులున్న ఈ రోజుల్లో.. చిన్నప్పుడు తనకు గోరుముద్దలు తినిపించిన బామ్మ ప్రేమను మరవలేదు ఓ మనవడు. అందుకే, ఒంటరితనంతో బాధపడుతున్న బామ్మ కోసం ఏకంగా 220 మైళ్లు, అంటే సుమారు ఏడు అల్ట్రా మారథాన్లు పరిగెత్తాడు. 98ఏళ్ల వయసులో ఆమెకు ఎనలేని సంతోషాన్నిచ్చాడు. అందుకే ఆ అమెరికా బామ్మ-మనవళ్ల ప్రేమ నెటిజన్ల హృదయాలను హత్తుకుంది.

Man runs 7 ultramarathons to meet his grandmother
బామ్మ కోసం.. 220 మైళ్లు పరిగెత్తిన మనవడు​!

By

Published : Jun 26, 2020, 2:52 PM IST

Updated : Jun 26, 2020, 4:14 PM IST

అమెరికాలో లాక్​డౌన్​ వేళ క్వారంటైన్​లో ఒంటరితనాన్ని అనుభవిస్తున్న బామ్మ కోసం.. 220మైళ్ల దూరాన్ని ఏడురోజుల్లో పూర్తి చేశాడో మనవడు.

వాషింగ్టటన్​కు చెందిన రన్నర్​ కొరే క్యాపెలోనికి.. బామ్మ రూత్​ ఆండ్రోస్​ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి తల్లిలా చూసుకున్న బామ్మను 'నానా' అంటూ ముద్దుగా పిలిచేవాడు. క్యాపెలోనికి అన్నింట తోడుంటూ.. ప్రేమను పంచింది రూత్​. అయితే, క్యాపెలోని కుటుంబం వాషింగ్టన్​లో స్థిరపడగా, బామ్మ రూత్​ మాత్రం పెన్సిల్వేనియాలోని స్వస్థలం స్క్రాంటన్​లోనే ఉండిపోయింది.

మనవడి ప్రేమకు సలాం...

98ఏళ్ల రూత్​కు కొద్దిరోజుల క్రితం కరోనా సోకింది. దీంతో రూత్​ను పూర్తిగా ఆసుపత్రిలోనే ఉంచి వైద్యం అందించారు. తక్కువ సమయంలోనే కరోనాను జయించింది రూత్​. ఆ తర్వాత ఆసుపత్రిలోనే కొద్దిరోజులు క్వారంటైన్​లో ఉండమన్నారు వైద్యులు. చాలా రోజులుగా ఆసుపత్రి గోడల మధ్యే ఉంటున్న రూత్​.. క్యాపెలోనీకి ఫోన్​ చేసి, వారిని చూడకుండానే తనకేమైనా అవుతుందేమోనని బాధపడేది.

పరుగు.. పరుగున..

బామ్మ వేదనను అర్థం చేసుకున్న క్యాపెలోని.. వాషింగ్టన్​లోని తన ఇంటి నుంచి పరుగు మొదలెట్టాడు. ఏడు రోజుల పాటు ఏడు మ్యారథాన్లు పూర్తి చేసి... పెన్సిల్వేనియాలోని స్క్రాంటన్​లో బామ్మ రూత్​ ఆండ్రస్​ ఉన్న నర్సింగ్​ హోమ్​ దగ్గర ఆగాడు. నాలుగో అంతస్తులో ఉన్న నానాకు ఫోన్​ చేసి, కిందికి చూడమన్నాడు. కిటీకీలోంచి మనవడిని చూసిన ఆ బామ్మ కళ్లు చెమర్చాయి. అక్కడున్నవారంతా 'నానా​ ఐ లవ్​ యూ' అంటూంటే మురిసిపోయింది రూత్​.

బామ్మ కోసం.. 220 మైళ్లు పరిగెత్తిన మనవడు​!

"నేను లాక్​డౌన్​లో బామ్మతో ఫోన్​లో​ మాట్లాడుతున్నప్పుడు.. నాకు అర్థమైంది. బామ్మ బాగా భయపడుతోంది. ఆమె మమ్మల్ని ఇక చూడలేదేమోనని బాధపడేది. ఆమె భయాన్ని పోగొట్టడానికి ఏదో ఒకటి చేయాలని నేను అనుకున్నా. అప్పడు నా గర్లఫ్రండ్​ సుశాన్​ కమేనర్​ నాకు ఈ ఉపాయమిచ్చింది. నేనిప్పటి వరకు పాల్గొన్న రేసుల్లో అతిపొడవైన రేసు సహారా ఎడారిలో 156మైళ్ల పందెం. కానీ, బామ్మ 220మైళ్ల దూరంలో ఉంది.. అంత దూరం మారథాన్​ చేయడానికి ముందు భయపడ్డాను. అయితే మన కోసం వారి జీవితాలే త్యాగం చేసి మనల్ని పెద్ద చేసినవారికి, ఈ వయసులో కాసింత సంతోషాన్నివ్వాలని నిర్ణయించుకున్నా."

-కొరే క్యాపెలోని, రన్నర్​

'రూత్​ ఛాలెంజ్​' నినాదంతో 7 మారథాన్లు పరిగెత్తి, బామ్మను కలిసిన క్యాపెలోనికి సామాజిక మాధ్యమాల్లో ఫాలోవర్లు విపరీతంగా పెరిగిపోయారు. బామ్మ ఆరోగ్యంగా ఇల్లు చేరాలని కోరుకుంటూ.. ఎందరో విరాళాలు పంపారు. దీంతో నానా పేరిట దాదాపు 24వేల అమెరికన్​ డాలర్లు పోగయ్యాయి.

ఇదీ చదవండి: ప్రత్యేక హెలికాప్టర్​లో గొరిల్లా.. కారణమేంటంటే?

Last Updated : Jun 26, 2020, 4:14 PM IST

ABOUT THE AUTHOR

...view details