ముగ్గురు పిల్లల్ని కాల్చి చంపి.. తండ్రి సూసైడ్ - us shooter

08:36 March 01
ముగ్గురు పిల్లల్ని కాల్చి చంపి.. తండ్రి సూసైడ్
Man Kills 3 children: అమెరికా కాలిఫోర్నియాలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి.. తన ముగ్గురు పిల్లలు సహా మరొకరిని కాల్చి చంపాడు. అనంతరం.. నిందితుడు కూడా గన్తో కాల్చుకొని చనిపోయాడు.
సక్రామెంటోలోని ఓ చర్చిలో సోమవారం ఈ ఘటన జరిగింది. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో.. కాల్పులు వినిపించాయని, ఐదుగురు చనిపోయిన ఉన్నట్లు చర్చి నిర్వాహకులు వెల్లడించారు. మృతుల్లో ముగ్గురు 15 ఏళ్ల లోపు వారని పేర్కొన్నారు. నిందితుడు కాకుండా మరో వ్యక్తి ఎవరనేది ఇంకా తెలియరాలేదు.
ఇదీ చూడండి:శరణు కోరుతూ వలసలు.. 5 లక్షల మందికిపైనే..