తెలంగాణ

telangana

ETV Bharat / international

మాస్క్ విషయంలో గొడవ.. విమానం నుంచి దించేశారు! - mesa airport fight

అసలే కరోనా కాలం.. మాస్క్​ లేకుండానే, విమానం ఎక్కాడు ఓ వ్యక్తి. తప్పనిసరిగా మాస్క్​ ధరించాల్సిందేనని అతడికి సూచించాడు మరో వ్యక్తి. తర్వాత ఆ ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. ఘర్షణ తలెత్తింది. చివరకు ఏమైందంటే..?

Man escorted off US plane after fight over masks
మాస్క్​ ధరించమన్నందకు.. విమానంలో గొడవ

By

Published : Oct 7, 2020, 1:20 PM IST

మాస్క్​ను ధరించడానికి తిరస్కరించిన ఓ వ్యక్తిని విమానం నుంచి బయటకు పంపించారు అధికారులు. ఈ ఘటన అమెరికా అరిజోనాలోని మెసా విమానాశ్రయం​లో జరిగింది. ర్యాలీ ల్యాన్స్​ఫోర్డ్​ అనే మహిళ తన వెనకాల ఉన్న వ్యక్తిని మాస్కు ధరించమని చెప్పగా గొడవ ప్రారంభమైంది.

మాస్క్​ ధరించమన్నందుకు.. విమానంలో గొడవ

ఆ వ్యక్తి ఫేస్​షీల్డ్​ను​ ధరించాడు. కానీ, అక్కడి నిబంధనల ప్రకారం.. తప్పనిసరిగా మాస్క్​ను వాడాల్సిందే. ల్యాన్స్​ఫోర్డ్​కు పక్కనే ఉన్న మరో వ్యక్తి.. అతడితో ఈ విషయాన్ని గుర్తు చేయగా ఇద్దరి మధ్య వాగ్వాదం తలెత్తింది. విమానంలోనే ఆఫ్ డ్యూటీలో ఉన్న ఓ అధికారి.. విమానాన్ని ఆపి, అతడిని బయటకు పంపించారు. మాస్క్​ను ధరించని వ్యక్తిని 52 ఏళ్ల రియో హోనాకర్​గా గుర్తించారు అధికారులు.

ఈ దృశ్యాలను ల్యాన్స్​ఫోర్డ్​ వీడియో తీయడం గమనార్హం.

ఇదీ చూడండి:ట్రంప్​కు కరోనా తగ్గకపోతే డిబేట్ వద్దు: బైడెన్

ABOUT THE AUTHOR

...view details