కర్ట్ కేసర్... 63ఏళ్ల రైతు. ఉండేది అమెరికా నెబ్రాస్కాలోని పెండర్లో. ఇటీవలే మృత్యువుకు దగ్గరకు వెళ్లి వచ్చారు ఈయన. ఆఖరి క్షణంలో ప్రాణాలు కాపాడుకునేందుకు తన కాలును తానే నరికేసుకున్నారు.
కొద్దిరోజుల క్రితం పొలంలో ఒంటరిగా పనిచేసుకుంటున్నారు కేసర్. మొక్కజొన్నలను ట్రక్కు నుంచి దింపుతున్నారు. ఆయన కాలు పొరపాటున మొక్కజొన్నలు ఆడే యంత్రంలో ఇరుక్కుపోయింది.
"డబ్బాలోకి మొక్కజొన్న అన్లోడ్ చేస్తున్నా. ఒకచోటు నుంచి మరోచోటుకు తీసుకెళ్తున్నా. అనుకోకుండా నేను హాపర్పై ఉన్న చిన్న రంధ్రంపై అడుగు పెట్టాను. వెంటనే అది నా కాలును లాగేసుకుంది. నేను వెనక్కు తీసేందుకు ప్రయత్నిస్తున్నా. ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పటికే అది నన్ను కుదిపేస్తోంది. అప్పుడు నాకు అనిపించింది. నన్నది పూర్తిగా లాగేస్తుందని. ఆ సమయంలో నా జేబులో కత్తి ఉంది. ఇక దానితో కాలు నరికేయటం ఒక్కటే మార్గం అనిపించింది. వెంటనే కోసేయటం మొదలుపెట్టా. నరాలు పటపటమని తెగిపోయినట్లు అనిపించింది. నేను అలానే కాలు కోసేసి ప్రమాదం నుంచి బయటపడ్డా."
-కర్ట్ కేసర్, నెబ్రాస్కా రైతు