తెలంగాణ

telangana

ETV Bharat / international

Man Burns Home: పాముల కోసం పొగ పెడితే.. రూ.13కోట్ల ఇల్లు బుగ్గిపాలు..! - పాముల కోసం పొగ బెడితే ఇల్లు బుగ్గిపాలు

Man Burns Home: పాముల బెడదను వదిలించుకునేందుకు పెట్టిన పొగ.. రూ. 13కోట్ల ఇంటిని కాల్చేసింది. ఈ ఘటన అమెరికాలో జరిగింది. దీనికి సంబంధించిన చిత్రాలను అగ్నిమాపక శాఖ ట్విట్టర్​లో షేర్ చేసింది.

Man Burns Home
ఇల్లు బుగ్గిపాలు

By

Published : Dec 7, 2021, 9:38 AM IST

Man Burns Home: తానొకటి తలిస్తే దైవం ఒకటి తలచినట్లుంది అమెరికాలోని మేరీలాండ్‌కు చెందిన వ్యక్తి పరిస్థితి. ఇంటికి పట్టిన పాముల పీడను వదిలించుకుందామని అతడు చేసిన ప్రయత్నం కాస్తా బెడిసి కొట్టింది. దాంతో పదివేల చదరపు అడుగుల్లో ఉన్న 1.8 మిలియన్ డాలర్ల విలువైన ఇల్లు మంటల్లో కాలిపోయింది.

ఓ మీడియా సంస్థ వెల్లడించిన కథనం ప్రకారం.. మేరీలాండ్‌కు చెందిన ఓ వ్యక్తి ఇంట్లో పాముల బెడద ఎక్కువగా ఉంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోవడం కారణంగా ఈ సారి చాలా పెద్ద రిస్క్ చేశాడు. బొగ్గును ఉపయోగించి పొగపెట్టాలనుకున్నాడు.

అయితే ఇంట్లో మండే స్వభావం కలిగిన వస్తువులకు దగ్గరగా బొగ్గును ఉంచడం వల్ల అవి కాలిపోయి ఇంటికి నిప్పంటుకుంది. దాంతో ఇల్లు కాలి లబోదిబోమన్నాడు. దీనికి సంబంధించిన చిత్రాలను అగ్నిమాపక శాఖ ట్విటర్‌లో షేర్ చేసింది. మంటల వల్ల ఇంటి గోడలు మాత్రమే మిగిలినట్లు తెలుస్తోంది. అయితే ఎలాంటి ప్రాణహాని సంభవించలేదు. ఇక పాములు సంగతేంటో తెలియరాలేదు..!

దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. మాకూ ఇలాంటి బెడద ఉన్నా.. ఈ ప్రయత్నం మాత్రం ఎప్పుడూ చేయలేదని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:నర్సు పొరపాటు.. ఇద్దరు పసికందులకు కొవిడ్ టీకా

ABOUT THE AUTHOR

...view details