సీన్ లెనాన్(47) అనే వ్యక్తి అమెరికాలోని న్యూజెర్సీ పోలీసులకు షాకిచ్చాడు. ఓ వ్యక్తిని అతికిరాతకంగా కొట్టి చంపాడని పోలీసులు అతడిని అరెస్టు చేస్తే.. తాను ఏకంగా 16 హత్యలు చేశాడని చెప్పాడు.
మార్చి 8న..
న్యూజెర్సీకి చెందిన మైకేల్ డబ్కౌస్కీ (66)ని లెనాన్ సుత్తితో కొట్టి దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత మైకేల్ కారుతో పరారయ్యాడు. రెండు రోజుల తర్వాత మార్చి 10న మిస్సోరిలోని సెయింట్ లూయిస్ ప్రాంతంలో పోలీసులు లెనాన్ను అరెస్టు చేశారు. డబ్కౌస్కీ తనను చిన్నతనంలో లైంగికంగా వేధించినందువల్లే ఈ హత్య చేసినట్లు విచారణలో పోలీసులకు తెలిపాడు. ఇప్పటికే తాను మరో 15 మందిని హత్య చేశాడని ఒప్పుకున్నాడు. మృతుల్లో తన భార్య కూడా ఉందని వెల్లడించాడు.