తెలంగాణ

telangana

ETV Bharat / international

ప్రత్యేక వృత్తిగా ఆ ఉద్యోగం- హెచ్​1బీ వీసా కంపెనీలు హ్యాపీ

మార్కెట్ రిసెర్చ్​​ ఎనలిస్ట్​ ఉద్యోగాన్ని అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్​ సేవల విభాగం ప్రత్యేక వృత్తిగా పరిగణించకపోవడంపై కొన్నేళ్లుగా అక్కడి సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. తాజాగా ఎనలిస్ట్​ ఉద్యోగాన్ని ప్రత్యేక వృత్తిగా పరిగణిస్తూ యూఎస్​సీఐఎస్​ కుదుర్చుకున్న ఒప్పందాన్ని కోర్టు ఆమోదించడంపై కంపెనీలు అనందం వ్యక్తం చేస్తున్నాయి.

h1b visa latest news
హెచ్​1బీ వీసా

By

Published : Oct 29, 2021, 8:06 AM IST

విదేశీ నిపుణులకిచ్చే హెచ్​-1బీ వీసాల నేపథ్యంలో మార్కెట్​ రీసెర్చ్​ ఎనలిస్ట్​ ఉద్యోగాన్ని ప్రత్యేక వృత్తిగా పరిగణిస్తూ యూఎస్​సీఐఎస్​(అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్​ సేవల విభాగం) కుదుర్చుకున్న ఒప్పందాన్ని అగ్రరాజ్యం కోర్టు ఆమోదించింది. దీంతో హెచ్​-1బీ ఉద్యోగులపై ఆధారపడుతున్న కంపెనీలు అనందం వ్యక్తం చేస్తున్నాయి.

గతంలో డిపార్ట్​మెంట్​ ఆఫ్​ లేబర్స్​ బ్యూరో ఆఫ్​ లేబర్​ స్టాటిస్టిక్స్​.. అమెరికాలోని ఉద్యోగాలతో కూడిన ఓ జాబితాను రూపొందించింది. అయితే ఈ జాబితాలో మార్కెట్​ రిసెర్చ్​ ఎనలిస్ట్​ ఉద్యోగం లేదని, అందువల్ల ఆ ఉద్యోగాన్ని ప్రత్యేక వృత్తిగా పరిగణించలేమని యూఎస్​సీఐఎస్​ తేల్చి చెప్పింది. దీంతో హెచ్​1బీ ఉద్యోగులపై ఆధారపడే కంపెనీలు నష్టపోయాయి.

తాజాగా.. కాలిఫోర్నియా ఉత్తర జిల్లా కోర్టు ఆమోదించిన ఒప్పందం ప్రకారం.. గతంలో కొట్టివేసిన తమ హెచ్​1బీ పిటిషన్లను యూఎస్​సీఐఎస్​ పునరుద్ధరించేందుకు కంపెనీలు విజ్ఞప్తి చేసుకోవచ్చు. ఈ ఒప్పందంతో వందలాది అమెరికా కంపెనీలు లబ్ధిపొందనున్నాయి. తాము ఎంపిక చేసుకున్న మార్కెట్​ ఎనలిస్ట్​లను వారు తిరిగి పొందగలుగుతారు.

అమెరికన్​ ఇమ్మిగ్రేషన్​ కౌన్సిల్​, అమెరికన్​ ఇమ్మిగ్రేషన్​ లాయర్స్​ అసోసియేషన్​, వాన్​డెర్​ హౌట్​ ఎల్​ఎల్​పీ- బెర్రి ఆపల్​మెన్​ అండ్​ లిడెన్​ ఎల్​ఎల్​పీ, కుక్​ బాక్స్​టర్​ ఇమ్మిగ్రేషన్​ ఎల్​ఎల్​సీ ఈ దావా వేసి ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. తాజా తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు బెర్రి ఆపిల్​మెన్​ అండ్​ లిడెన్​ ఎల్​ఎల్​పీకి చెందిన జెఫ్​ జోసెఫ్​. 'మనకున్న నిబంధనలు ఏచెబుతున్నాయి, వాస్తవిక ప్రపంచంలో కంపెనీలు తమ అభ్యర్థుల్లో ఏ లక్షణాలు చూసి చేర్చుకుంటాయి అన్న అంశాల మధ్య సరైన సమతుల్యం ఈ ఒప్పందం ద్వారా లభిస్తుంది. యూఎస్​సీఐఎస్​ ఇకనైన వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుంటుందని ఆశిస్తున్నా,' అని ఆయన అన్నారు.

ఇదీ చూడండి:-హెచ్​-1బీ వీసాలపై అమెరికా కోర్టు కీలక తీర్పు

ABOUT THE AUTHOR

...view details